భారత దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న లాక్ డౌన్ తొలగిస్తారా లేదా అనే విషయంపై ఎంతగానో  చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఇక ఇదే అంశంపై దేశ ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించి దేశంలో లాక్ డౌన్  కొనసాగించాలా వద్దా అనే దానిపై అందరూ ముఖ్యమంత్రులు అభిప్రాయాలు సేకరించిన విషయం తెలిసిందే. ఇక ఈ సమావేశం పూర్తవ్వగానే ముఖ్యమంత్రి కేసీఆర్ ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ పొడగిస్తున్నట్లు  ప్రకటించారు. అయితే ప్రస్తుతం లాక్ డౌన్  నేపద్యంలో  దేశం రాష్ట్రం ఆర్థికంగా నష్టాలు ఉన్నది అంటూ తెలిపిన ముఖ్యమంత్రి  కెసిఆర్ అది కోలుకోవాలంటే క్వాంటిటేటివ్ ఈజింగ్  ఒక్కటే మార్గం అని సూచించారు. 

 

 అసలు క్వాంటిటేటివ్ ఈజింగ్ అంటే ఏమిటి అంటే.. ఎప్పుడైనా  ఇలాంటి సంక్షోభాలు వచ్చినప్పుడు.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర డబ్బులు లేనప్పుడు.. క్వాంటిటేటివ్ ఈజింగ్  పద్ధతిని వాడాల్సి ఉంటుంది. ఇది చాలా పాపులర్ అయిన టెక్నిక్.. కెసిఆర్ చేసిన ఆలోచన ఎంతో గొప్పదైనది. మనదేశంలో రిజర్వుబ్యాంకు ఇండియా మాదిరిగానే ప్రతి దేశంలో కొన్ని బ్యాంకులు ఉంటాయి. వారంతా వారి వారి బ్యాంకుల ద్వారా దేశానికి ఉన్న జిడిపి  ని బట్టి కొంత శాతాన్ని డబ్బును మార్కెట్లో రిలీస్ చేస్తారు . 

 

 తద్వారా అక్కడ పరిస్థితి నుంచి బయట పడేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన హెలికాప్టర్ మని  ఏమిటి అంటే. పెద్ద మొత్తంలో నేరుగా డబ్బులను ప్రజల వద్దకు తీసుకెళ్లడం ఆర్థిక కుంగుబాటు నుంచి కోలుకోవడానికి లేదా వడ్డీరేట్లు పూర్తిగా పడిపోయినప్పుడు నేరుగా ప్రజల వద్దకు తీసుకెళ్లడమే  హెలికాఫ్టర్ అని అంటారు. ఇలా కేసీఆర్ హెలికాప్టర్ మని  సహా.. క్వాంటిటేటివ్  ఈజింగ్  పద్ధతి అవలంభించాలి అంటూ చెబుతున్నారు. అయితే ఇప్పటికే భారత ఆర్థిక వ్యవస్థ మందగమనంలో సాగుతున్న తరుణంలో రిజర్వ్  బ్యాంకు దగ్గర ఎలాంటి నిధులు లేవు మరి కేసీఆర్ చేసిన డిమాండ్ను నెరవేరుతుందా లేదా అన్నది మాత్రం చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: