ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ అమెరికాని ఓ ఆట ఆడుకుంటుంది. దాదాపు ఐదు లక్షల పాజిటివ్ కేసులు నమోదు కాగా మృతుల సంఖ్య 20 వేలకు పైగా ఉంది. కరోనా వైరస్ తో చాలామంది అమెరికాలో బాధపడుతున్నారు. ఎక్కువగా అమెరికాలోని న్యూయార్క్ నగరంలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో వస్తు ఉన్న పేషెంట్లకు వైద్య సదుపాయం అందించడానికి సిబ్బంది మరియు పరికరాలు లేక అనేక అవస్థలు పడుతోంది అమెరికా. ఎక్కువగా న్యూయార్క్ నగరంలోని కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవటానికి గల కారణాల గురించి రకరకాల వార్తలు అంతర్జాతీయ స్థాయిలో వినబడుతున్నాయి. పూర్తి మేటర్ లోకి వెళ్తే అమెరికాలో మొత్తం కరోనా మరణాలు ఈ విషయంలో 42శాతం న్యూయార్క్ లోనే సంభవించినట్లు సమాచారం.

 

అమెరికాలో అత్యంత ప్రజలు న్యూయార్క్ నగరంలో ఉండటంతో అమెరికా ప్రభుత్వం నియంత్రణ చేపట్టే విషయంలో చాలా లేట్ అయింది. దీంతో వైరస్ ఎక్కువగా న్యూయార్క్ నగరంలో భయంకరంగా వ్యాప్తి చెందింది. పైగా వాతావరణం కూడా సహకరించడంతో చాలావరకు ప్రజలు వారి నగరంలో ఉండటంతో ఈ వైరస్ న్యూయార్క్ లో బాగా ప్రభావం చూపింది. ఫలితంగా మరణాలు న్యూయార్క్ ప్రాంతంలో రికార్డు స్థాయిలో సంభవించినట్లు వార్తలు వస్తున్నాయి.

 

అంతేకాకుండా వైద్య సదుపాయం వైద్య పరికరాలు కావలసినంత లేకపోవడంతో న్యూయార్క్ నగరంలో ఆసుపత్రికి వచ్చే కరోనా లక్షణాలున్నా... వాళ్లను ఇళ్లలోనే క్వారంటైన్ అవ్వమంటున్నారు. పరిస్థితి తీవ్రమైతే... అప్పుడు ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో చాలా మంది ఇళ్లలోనే ఉండటంతో పైగా ఎక్కువగా అపార్ట్మెంట్లో ఉండటంతో వైరస్ ఈజీ గా వ్యాప్తి చెందుతున్నట్లు సమాచారం. మొత్తంమీద చూసుకుంటే కరోనా వైరస్ నియంత్రించడంలో అమెరికా ప్రభుత్వం లేట్ అవ్వటం తో న్యూయార్క్ నగరంలో ఎక్కువ మరణాలు సంభవించినట్లు బాగా నష్టపోతున్నట్లు అంతర్జాతీయ స్థాయిలో వార్తలు వినబడుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: