గత కొద్దిరోజులుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై విమర్శకులు విరుచుకుపడుతున్నారు. ఒక వైపు కేసిఆర్ వరుసగా ప్రెస్ మీట్ లు ఏర్పాటు చేస్తుంటే జగన్ మాత్రం మోదీతో లాక్ డౌన్ కొద్ది ఏరియాల వరకే పరిమితం చేయాలని కోరడంతో అంతా ముఖ్యమంత్రి పై ధ్వజమెత్తారు.

 

అయితే తాజాగా చేసిన ఒక సర్వేలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో పెరుగుతున్న కేసులు శాతం చాలా తక్కువగా ఉందని తేలింది. తెలంగాణలో రోజురోజుకీ పరిస్థితి తీవ్రమవుతున్న నేపథ్యంలో కేసీఆర్ జనాలకు ధైర్యం చెప్పేందుకు ప్రెస్ మీట్ లు పెడుతుంటే జగన్ తనదైన శైలిలో కట్టడి చేసేందుకు కొన్ని కీలక నిర్ణయాలను ఆచరణలో పెడుతున్నాడు.

 

వివరాళ లోకి వెళితే కెసిఆర్ కరోనా నియంత్రణలో భాగంగా ఇకపై రోడ్డు పైకి వచ్చే ప్రతి వ్యక్తి తప్పకుండా మాస్కులు ధరించాలని... లేనిపక్షంలో వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని చెప్పిన విషయం తెలిసిందే. అయితే జగన్ ఇటువంటి ఘాటైన వ్యాఖ్యలు ఏమీ చేయకపోయినా కెసిఆర్ చేయలేని ఒక పనిని చేసి చూపిస్తున్నాడు. తాజాగా అధికారులందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 5.3 కోట్లమంది ప్రజలకు.. మనిషికి మూడు మార్కులు చొప్పున అందచేయవలసిందిగా ఆదేశాలు జారీ చేశాడు.

 

లెక్కన మొత్తం రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 16 కోట్ల మాస్కులు ప్రజలకు పంపిణీ చేయబడతాయి. ఆదివారం జరిగిన కరోనా వైరస్ యొక్క విశ్లేషణ సమీక్ష లో జగన్ నిర్ణయం తీసుకోగా లోపల గ్రామ మరియు వార్డు వాలంటీర్లు ఇప్పటికే డోర్ టు డోర్ సర్వే మూడవ రౌండు కూడా విజయవంతంగా పూర్తిచేశారు.

 

మూడవ రౌండ్ సర్వేలో దాదాపు రాష్ట్రంలోని 1.47 కోట్ల కుటుంబాలలో 1.43 కోట్ల కుటుంబాలు కవర్ అయ్యాయని మరియు దాదాపు 32,349 మందికి వ్యాధి లక్షణాలు ఉన్నట్లు లోకల్ ఏఎన్ఎమ్ లు మరియు ఆశ వర్కర్లు తెలిపారు. ఇకపోతే 9,107 మందికి కరోనా వైరస్ టెస్టులు జరపాలని డాక్టర్లు భావించినట్లు కూడా తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: