ప్రపంచంలోని మరే దేశంలోనూ లేనంతగా అమెరికాలో కరోనా వైరస్ కరాళనృత్యం చేస్తోంది. మొత్తం దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. ముఖ్యంగా న్యూయార్క్‌ను ఛిన్నాభిన్నం చేస్తోంది. మొన్నటిదాకా ఇటలీ, స్పెయిన్ వైరస్‌ ధాటికి అతలాకుతలం కాగా ఇప్పుడు అమెరికా ఆ స్థానాన్ని ఆక్రమించింది. కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు అత్యధికంగా ఉన్న దేశం ఇప్పుడు అమెరికానే. గంట గంటకూ కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య పెరుగుతోంది. నిన్న ఒక్క రోజే 1,514 మంది కరోనా బారినపడి చనిపోయారు.

 

అమెరికా వ్యాప్తంగా నమోదవుతున్న మరణాలు, కేసుల్లో సగం ఒక్క న్యూయార్క్ రాష్ట్రంలోనే నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో మొత్తం మరణాల సంఖ్య 22వేలు దాటిపోయింది. ఏ దేశంలోనూ కరోనా బారిన పడి ఇంతమంది చనిపోలేదు. దేశంలోని మొత్తం 50 రాష్ట్రాలను  మహా విపత్తు ఎదుర్కొంటున్న రాష్ట్రాలుగా ప్రకటించారు.  అమెరికాలో 24 గంటల వ్యవధిలో 1514 మంది మృతి చెందారు. శనివారం ఒక్కరోజే ఇక్కడ 1920 మంది చనిపోగా, ఒక్క న్యూయార్క్‌లోనే 758 మంది ప్రాణాలు కోల్పోయారు.  9,385 మరణాలు ఒక్క న్యూయార్క్‌లో సంభవించినవే.  ప్రపంచంలో ఇదే అత్యధికం కావడం గమనార్హం.

 

గతంలో వివిధ పద్ధతుల ద్వారా అంచనా వేసిన ప్రకారం యూఎస్‌లో వైరస్‌ తీవ్రత గరిష్ఠ స్థాయికి చేరుకునేందుకు దగ్గరగా ఉందని ‘ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్’‌(ఎఫ్‌డీఏ) కమిషనర్‌ స్టీఫెన్‌ హాన్‌ తెలిపారు.   వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న న్యూయార్క్‌ రాష్ట్రంలో ఆదివారం 758 మంది మరణించినట్లు గవర్నర్‌ ఆండ్రూ క్యుమో తెలిపారు. రోజువారీ కేసుల సంఖ్య తగ్గనప్పటికీ.. వ్యాప్తి రేటు మాత్రం తగ్గిందని వెల్లడించారు.  కరోనాని కట్టడి చేయడానికి అన్ని దేశాలు లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి  వరకు అమెరికాలో మాత్రం లాక్ డౌన్ అమలు కాకపోవడం పై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: