చైనా దేశంలోని వుహాన్ నగరంలో విజృంభించిన ప్రాణాంతకమైన అంటువ్యాధి కోవిడ్ 19 యూరోప్ దేశాలపై పంజా విసురుతుంది. అమెరికా, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్ లాంటి దేశాలు ప్రస్తుతం కరోనా వైరస్ కోరల్లో చిక్కుకుపోయి లక్షల సంఖ్యలో తమ ప్రజల ప్రాణాలను కోల్పోతున్నాయి. 155 దేశాలలో వ్యాప్తి చెందిన కరోనా వైరస్ తీవ్రత కేవలం ఐదు దేశాలపై ఎక్కువగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ఆ ఐదు దేశాలు ఏంటో ఒక్క సారి తెలుసుకుందాం.



1. అమెరికా:

గత కొన్ని వారాలుగా అమెరికా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. కరోనా వైరస్ పుట్టిన చైనా దేశంలో కంటే ఎక్కువ కేసులు అమెరికా రాష్ట్రంలో ఎప్పుడో అనగా ఇరవై రోజుల కిందటే నమోదయ్యాయి. ప్రపంచం మొత్తంలో దాదాపు 19 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... వాటిలో 5, 60, 433 పాజిటివ్ కేసులు అమెరికా దేశంలోనే నమోదయ్యాయి. మొత్తం కరోనా మరణాల సంఖ్య 22, 115 కి పెరగగా... ఇంకో 11, 766 మంది కరోనా వైరస్ కారణంగా చనిపోయే పరిస్థితిలో ఉన్నారని అమెరికా దేశం చెబుతోంది. అమెరికాలో ఇప్పటి వరకు 32, 634 మంది కోవిడ్ 19 వ్యాధిగ్రస్తులు కోలుకున్నారని తెలుస్తుంది. ఏది ఏమైనా ట్రంప్ సరైన నిర్ణయాన్ని సకాలంలో తీసుకోకపోవడం వలన కరోనా వైరస్ ఆ దేశంలో ఘోరంగా విజృంభిస్తుందని తెలుస్తోంది.


2. స్పెయిన్:


ఫిబ్రవరి ఒకటవ తేదీన స్పెయిన్ దేశంలో 1000 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... ఏప్రిల్ 13వ తారీకు నాటికి కరోనా కేసుల సంఖ్య 1, 66, 831 కు చేరుకుంది. అనగా ప్రతి రోజు సరాసరిగా మూడు వేల కొత్త కేసులు నమోదయ్యాయని తెలుస్తుంది. గత కొన్ని వారాలుగా కరోనా తీవ్రత అధికంగా ఉన్న దేశాల జాబితాలో రెండవ స్థానంలో నిలిచిన ఇటలీ దేశాన్ని దాటి స్పెయిన్ దేశం మూడవ స్థానం నుండి రెండవ స్థానం లోకి అడుగుపెట్టింది. కరోనా మరణాల సంఖ్య లో ఇటలీ దేశం కంటే స్పెయిన్ దేశం కాస్త వెనకబడిన కోవిడ్ 19 రోగుల సంఖ్యలో ఇటలీ దేశం కంటే స్పెయిన్ దేశం ముందుందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. స్పెయిన్ దేశంలో కరోనా వైరస్ బారిన పడి ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 17, 209. ఇక్కడ ఓ సంతోషకరమైన వార్త ఏంటంటే... 1, 66, 831 కరోనా రోగులలో ఇప్పటికే 62, 391 మంది వ్యాధి నుండి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు.


3. ఇటలీ:

కరోనా వైరస్ నియంత్రణ కొరకు ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకోకుండా దయనీయమైన ఫలితాన్ని అనుభవిస్తున్న ఇటలీ దేశం గురించి తెలుసుకుంటే ఎవరికైనా కన్నీళ్లు చెమ్మగిల్లుతాయి. ఆరోగ్యపరంగా చాలా బలమైన ఈ దేశం కరోనా దెబ్బకి తమ దేశ ప్రజలను వేల సంఖ్యలో కోల్పోతుంది. ఈ చలి దేశంలో అత్యధికంగా వృద్ధులు ఉండటం వలన వారు కరోనా వైరస్ బారిన పడుతున్నారు. అలాగే వారిలో రోగనిరోధకశక్తి బలహీనంగా ఉండటం వలన కరోనా వైరస్ కి ఆహుతి అవుతున్నారు. ఇప్పటివరకు ఇటలీ దేశంలో 1, 56,363 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... వారిలో 19, 899 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే 34 వేల మంది కరోనా వైరస్ పై జయించి ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు.


4. ఫ్రాన్స్:


ఫ్రాన్సు దేశంలో ఇప్పటివరకు 1, 32, 591 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. వారిలో 14, 393 మంది ప్రాణాలను కోల్పోయారు. 27, 186 మంది కరోనా వైరస్ నుండి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 6, 845 మంది కోవిడ్ 19 రోగుల పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.


5. జర్మనీ

జర్మనీ దేశంలో ఇప్పటివరకు 1, 27, 854 మంది కరోనా వైరస్ బారిన పడగా... వారిలో కేవలం 3, 022 మంది మృత్యువాత పడ్డారు. 60, 300 మంది వ్యాధి నుండి పూర్తిగా రికవరీ అయ్యి డిచ్ఛార్జ్ కూడా అయ్యారు. జర్మనీ దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ... మరణాల సంఖ్య (3, 022)చాలా తక్కువగా ఉంది. అలాగే రికవరీ అయిన వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉండటం జర్మనీ దేశానికి ఓ పెద్ద శుభవార్త గా చెప్పుకోవచ్చు. జర్మనీ దేశం కంటే యునైటెడ్ కింగ్డమ్ లో కరోనా మరణాలు ఎక్కువగా సంభవించాయి. యూకే లో 84,279 కరోనా బారిన పడగా... వారిలో 10, 631 మంది మరణించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: