తాజాగా ఈపీఎఫ్ సంస్థ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొని రావడం జరిగింది. ప్రస్తుతం కరోనా వైరస్ పరిస్థితులన్నీ తరుణంలో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన  స్కీమ్ ను అందుబాటులోకి తీసుకుని రావడం జరిగింది. ఇక ప్యాకేజీ డబ్బులు అన్నిటిని కూడా సబ్ స్క్రైబర్లకి చెందిన ఈపీఎఫ్ అకౌంట్లో డబ్బులు వేయడానికి ఈపీఎఫ్వో ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొని రావడం జరిగింది.


ఇక ఆర్థిక ప్యాకేజీ ప్రకారంగా అర్హత కలిగిన సంస్థలు ఈసీఅర్ సమర్పించి డబ్బులను వాళ్ల ఖాతాలోకి జమ చేసుకోవచ్చు అని తెలియజేశారు. ఇలా జమ చేసిన తర్వాత ఈపీఎఫ్ సబ్ స్క్రైబర్లకి UAN నెంబర్ పై మూడు నెలల పిఎఫ్ డబ్బులను జమ చేయడం జరుగుతుంది. ఈ స్కీం 15 వేల రూపాయల లోపు వేతనం ఉన్నవారికే వర్తిస్తుందని సంస్థ పేర్కొంది.


ఈ స్కీం ద్వారా దాదాపు 79 లక్షల మంది సబ్ స్క్రైబర్లకి అంతేకాకుండా 3.8 లక్షల సంస్థలు ప్రయోజనాలని పొందవచ్చు.  ఇప్పటికే ఈ ప్యాకేజీలో అమలు చేసేందుకు కార్మిక శాఖ నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. ఇక కరోనా వైరస్ ను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 1.7 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. దీనితో పాటు చాలా కీలక నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ఇటీవల rbi కూడా మూడు నెలల  మారటోరియం అనే కొత్త విధానాన్ని కూడా అమలులోకి తీసుకొని వచ్చింది. ఇది ఇలా ఉండగా మరోవైపు మన దేశంలో రోజురోజుకీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. ఏది ఏమైనా ఈ స్కీమ్ కి అర్హులైన వారు అప్లై చేసుకొని EPF నుండి వచ్చే ఫలితాలను పొందవచ్చు. ఎందుకంటే మనకు EPF లో మన నుంచి వచ్చే సొమ్ముకి వడ్డీని కలిపి ఇవ్వడం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: