ప్రపంచంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోనా... కరోనా... కరోనా... ఎవరి నోట చూసినా ఇదే మాట వినిపిస్తోంది. ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన లాక్ డౌన్ విధానం అన్ని రాష్ట్రాల్లో కొనసాగుతోంది. మరోవైపు ప్రజలను ఈ మహమ్మారి నుంచి కాపాడేందుకు నిరంతరం వైద్య రంగం కృషి చేస్తూనే ఉంది. నిరంతరం వారి కోసం వైద్యులు నర్సులు శ్రమిస్తూనే ఉన్నారు. అంతేకాకుండా వారి కుటుంబాలకు కూడా దూరంగా ఉంటూ.., వారి ప్రాణాలు సైతం లెక్కచేయకుండా కరోనా వైరస్ బాధితులకు నిరంతరం సేవలు అందిస్తున్నారు. వైద్య సిబ్బంది అధికారులు వాళ్ల కన్న బిడ్డలను చూసుకోలేక తీవ్ర ఆవేదన చెందుతున్నప్పటికీ ఆ బాధనంతా పక్కనపెట్టి బాధితులను రక్షించుకోవాలని వారి విధులను నిర్వహిస్తున్నారు.  

 


కొంత మంది వైద్య శిబిరానికి చప్పట్లు కొడుతూ కృతజ్ఞత తెలియజేస్తూ ఉంటే మరికొందరు పాటల రూపంలో వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మరోవైపు తాజాగా గూగుల్ డూడుల్ తో వైద్య అధికారులకు ధన్యవాదాలు తెలిపింది.. వైద్యులకు, నర్సులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ హార్ట్ ఇమేజ్ తో వారి సేవలను అభినందించింది గూగుల్ సంస్థ.

 

 

అంతేకాకుండా  ప్రతిరోజు  అత్యవసర సేవలు అందిస్తున్న వైద్య సిబ్బంది గూగుల్ సరికొత్త డూడుల్ తో వారికి కృతజ్ఞత తెలియజేస్తుంది. అలాగే కరోనా వైరస్ కోసం సేవలు అందిస్తున్న వారి అందరికీ డూడుల్ సిరీస్ తో గౌరవం ఇస్తున్నామని తన పేజీలో తెలియజేయడం జరిగింది.  దీనితో పాటు అత్యవసర సేవలు అందిస్తున్న అన్ని రంగాల కార్మికులకు రైతు కూలీలు చేస్తున్న సేవలను అభినందిస్తూ ఆనిమేటెడ్ చిత్రాలను ప్రదర్శించడం మొదలు పెట్టింది. ఇక ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తుంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా లక్షమందికి పైగా మరణించగా. లక్షలాది మంది ఈ మహమ్మారి  బారినపడి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: