ప్రపంచ క్రికెట్ లో టీమ్ ఇండియా డేర్ అండ్ డాషింగ్  కెప్టెన్ విరాట్ కోహ్లీ కి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది అన్న విషయం తెలిసిందే . ప్రపంచ మేటి  బ్యాట్స్మెన్ లలో  ఒకరు విరాట్ కోహ్లీ. తనదైన ఆటతో అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తూ ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ గా కొనసాగుతున్నారు.టీమిండియా బాధ్యతలను భుజాలపై వేసుకుని ముందుకు నడుపిస్తూనే టీమిండియా లో కీలక ఆటగాడిగా జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తూ ఎన్నో విజయాలను అందించారు. దేశవాళి క్రికెట్ నుంచి తన ప్రతిభను చాటుతూ... అందరి చూపు ఆకర్షించాడు విరాట్ కోహ్లీ. ముఖ్యంగా తన తండ్రి చనిపోయినప్పటికీ కూడా... మ్యాచ్ ఆడి క్రికెట్ పట్ల తనకున్న నిబద్ధతను చాటాడు విరాట్ కోహ్లీ. తండ్రి  చనిపోయిన సమయంలో కర్ణాటకలో జరిగిన రంజీ ట్రోఫీలో జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న కోహ్లీ నిబద్ధతతో మ్యాచ్ ఆడాడు. అప్పుడే దేశం చూపును  మొత్తం ఆకర్షించాడు  విరాట్ కోహ్లీ

 

 

 ఇక ఆ తర్వాత అండర్ 19 జట్టులో కీలక ఆటగాడిగా మారిపోయాడు. 2008లో జరిగిన అండర్-19 ప్రపంచ కప్ కి సారథ్యం వహించిన విరాట్ కోహ్లీ టీమిండియాకు వరల్డ్ కప్ ను సాధించి పెట్టాడు. తనదైన బ్యాటింగ్ తో  అండర్ 19 లో అదరగొట్టాడు విరాట్ కోహ్లీ.   తనకు తిరుగు లేదు అని నిరూపించి  విజయం సాధించాడు. ఇక ఆ తర్వాత ఆస్ట్రేలియాలో జరిగిన 2009 ఎమెర్జింగ్ ప్లేయర్స్ టోర్నమెంట్ లో  అసాధారణ రీతిలో అద్భుత ప్రదర్శన చేసి  అందరి చూపు ఆకర్షించాడు. ఆ తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్లో కూడా తనదైన ప్రదర్శన చేశాడు. 2008లో శ్రీలంక తో ఆడిన ఐడియా కప్ లో  విరాట్ కోహ్లీ వన్డే లోకి అడుగు పెట్టాడు. ఆ తర్వాత మహేంద్రసింగ్ ధోని నుంచి టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు  చేపట్టిన విరాట్ కోహ్లీ ఆ తర్వాత క్రమక్రమంగా టీమ్ ఇండియా పగ్గాలు  పూర్తిగా తన చేతిలోకి తీసుకున్నాడు.

 

 

 అప్పటి నుంచి తనదైన కెప్టెన్సీ తో జట్టును ముందుకు నడిపిస్తున్నారు. భారత క్రికెట్ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పేలా ఎన్నో విజయాలను  భారత్ కు  అందించాడు విరాట్ కోహ్లీ. మైదానంలో ఎప్పుడూ దూకుడుగా కనిపించే విరాట్ కోహ్లీ సహచర ఆటగాళ్లలో  కూడా ఎప్పుడు  స్పూర్తిని నింపుతూ ఉంటాడు. అంతే కాకుండా ప్రస్తుతం భారత ఆటగాళ్లలో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఆటగాడు కూడా విరాట్. ప్రపంచ నెంబర్వన్ బ్యాట్స్మన్ కూడా విరాట్ కోహ్లీ. ఎన్నో రికార్డులను సైతం కొల్లగొట్టే రికార్డుల రారాజుగా మారిపోయాడు  విరాట్ కోహ్లీ. భారత క్రికెట్ జట్టుకు ఎనలేని సేవలందించి.. భారత ఖ్యాతిని పెంచిన  విరాట్ కోహ్లీ ఈ రోజు హెరాల్డ్ విజేత.

మరింత సమాచారం తెలుసుకోండి: