ఆంధ్రప్రదేశ్ రోజు రోజుకి కరోనా  వైరస్ ప్రభావం పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కరోనా వైరస్ ను  కట్టడి చేసేందుకు జగన్ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ కరోనా  కట్టడి చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కట్టుదిట్టమైన  చర్యలు చేపడుతున్న ఏపీ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి 3 మాస్కులు  అందజేయాలని జగన్మోహన్ రెడ్డి సర్కారు నిర్ణయించింది. కానీ తాజాగా దీనిపై ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన విజయసాయిరెడ్డి.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పై ప్రశంసలు కురిపించారు . 

 

 

 రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి మూడు మాస్కులు అందజేయాలని.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  తీసుకున్న నిర్ణయంపై దేశమంతా ప్రస్తుతం హర్షం వ్యక్తం చేస్తోంది అంటూ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పుడు వరకు 16 కోట్ల మాస్కుల పంపిణీ ఎక్కడ జరగలేదు అంటూ విజయసాయి రెడ్డి తెలిపారు. కరోనా ను  తరిమికొట్టేందుకు జగన్ సర్కార్ మాస్క్ లను పంపిణీ చేసి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించబోతుంది అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దేశంలోనే అతి తక్కువ ప్రాణనష్టం తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సేఫెస్ట్ ప్లేస్ గా  ఉందని.. విజయ్ సాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా తెలిపారు. 

 

 

 అయితే రాష్ట్ర వ్యాప్తంగా కరోనా  వైరస్ ను కట్టడి చేసేందుకు జగన్మోహన్ రెడ్డి సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు కొంతమంది అనవసరంగా విమర్శలు చేస్తున్నారు అంటూ వ్యాఖ్యానించిన  వైసీపీ పార్లమెంటరీ విజయసాయిరెడ్డి... ఎవరెన్ని విమర్శలు చేసినా కరోనా  వైరస్ ను కట్టడి చేసేందుకు జగన్మోహన్ రెడ్డి సర్కారు మాత్రం ఎప్పటికీ పని చేస్తూనే ఉంటుంది అంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పరిస్థితులు దృశ్య కరోనా  వైరస్ ను కట్టడి చేసేందుకు ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనే విచక్షణాధికారం ప్రభుత్వానికి ఉంటుందని... జగన్ సర్కార్  ఏ రాష్ట్రం అమలు చేయని విధంగా... రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం  ముందు జాగ్రత్త చర్యలు తీసుకుకుంటున్నారని  వ్యాఖ్యానించారు. కాని చంద్రబాబు అనుకూల మీడియా మాత్రం ఇవేవీ పట్టనట్లు... జగన్ సర్కార్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండి పడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: