ప్రముఖ దిగ్గజ దేశీయ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు తగు సూచనలు ఇవ్వడం జరిగింది. మోసగాళ్లు కొత్త విధానాలతో కస్టమర్లను మోసం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని sbi వినియోగదారులకు సూచనలు ఇవ్వడం జరిగింది. కేటుగాళ్లు కొత్త మార్గాలలో బ్యాంకు కస్టమర్ లో అందరిని మోసం చేస్తున్నారని తెలిపింది దీనితో కస్టమర్లులందరూ జాగ్రత్తగా ఉండటం చాలా మంచిదని పేర్కొంది. 

 


తాజాగా sbi ట్విట్టర్ వేదికగా చేసుకొని మోసగాళ్లు సైబర్ క్రైమ్ చేయడానికి కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు అని ట్రీట్ చేయడం జరిగింది. ముందుగా మోసగాళ్ళు బ్యాంకు కస్టమర్లకు మెసేజ్ లు పంపుతూ, మెసేజ్ లో ఉన్న లింక్ పై క్లిక్ చేస్తే నెట్ బ్యాంకింగ్ పేజీ లాగా ఇంకొక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది అని sbi తన కస్టమర్ లను పేర్కొంది. దీనితో చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది అని sbi అధికారులు తెలియచేస్తున్నారు. 


కస్టమర్లకు ఎవరికైనా ఇలాంటి మెసేజులు వస్తే వెంటనే డిలీట్ చేయడం మంచిది అని sbi తన ఖాతాదారులను వ్యాప్తి చేస్తుంది. దీనితో పాటు మీ బ్యాంకింగ్ సేవల వివరాలు ఎవరికీ కూడా తెలియ చేయవద్దు అని తెలిపింది. ఇప్పటివరకు ఎవరికైనా ఇలాంటి మెసేజ్ లు వచ్చి ఉంటే... ఆ విషయాన్ని వెంటనే  epg.cms@sbi.co.in, phishing@sbi.co.in ఈ - మెయిల్ ద్వారా వాళ్లకు తెలియ చేయాలని కోరింది. అంతే కాకుండా ఇలాంటి ఘటనలు సమీపంలో ఉన్న సైబర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకి తెలియజేయాలని sbi వారి కస్టమర్ లకు తెలియజేసింది. 

 

 

అంతే కాకుండా http://www.onlinesbi.digital ఈ ఫేక్ వెబ్సైట్ తో చాలా జాగ్రత్తగా ఉండాలని తెలియజేసింది. దీనితోపాటు పాస్వర్డ్ అప్డేట్ చేసుకోమని.. ఇక తదితర మెసేజ్ లు ఏమి వచ్చినా కూడా వాటిని ఏమి కూడా ఓపెన్ చేయవద్దు అని కస్టమర్లకు హెచ్చరించింది. అలా చేసినట్లయితే క్షణాల్లోనే మీ ఖాతాలో డబ్బులు మటుమాయం అవుతాయని హెచ్చరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: