ప్రస్తుతం దేశంలో కరోనా భయంతో ఎవరూ ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయంతో వణికి పోతున్నారు.  ఈ నేపథ్యంలో  ఓ మహిళా అధికారి చేసిన పనికి యావత్ దేశం సెల్యూట్ అంటున్నారు.  ఇలాంటి స్ఫూర్తి గల అధికారులను ఆదర్శంగా తీసుకోవాలని అంటున్నారు. నెల రోజుల క్రితమే బిడ్డకు జన్మనిచ్చారు ఓ ఐఏఎస్ అధికారిణి.. తనకున్న సెలవులను కూడా వాడుకోకుండా కరోనా నేపథ్యంలో ప్రజలకు సేవ చేయడానికి బిడ్డను ఎత్తుకుని కార్యాలయానికి వస్తున్నారు.

 

గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్‌ సృజన గుమ్మళ్ళ విధి నిర్వహణలో చూపిస్తోన్న నిబద్ధతపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.  తాజాగా కేంద్ర మంత్రి షెకావత్ ఆమెను ప్రశంసిస్తూ ట్వీట్ చేసారు. "కరోనాపై పోరాడేందుకు ఇటువంటి యోధులు ఉండడం మన దేశం చేసుకున్న అదృష్టం. పని పట్ల నిబద్ధత చూపుతూ అటువంటి యోధులకు ఓ ఉదాహరణగా నిలుస్తోన్న ఆమెకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు" అని కేంద్ర మంత్రి ఆమెను పొగిడారు. 

 

ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా భయంతో వణికి పోతుంది. ఈ  సమయంలో విధులు నిర్వహించడం మనిషిగా తన బాధ్యత అని సృజన అన్నారు. ఇలాంటి సమయంలో అందరూ కలిసి పనిచేస్తేనే ఈ పోరాటానికి బలం చేకూరుతుందన్నారు.ఆమె 2013 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందని అధికారిణి.  మీరు చాలా గ్రేట్ మేడమ్అం టూ కామెంట్లు చేస్తున్నారు. అనవసరంగా సెలవులు పెట్టి ఇంట్లో ఉండే అధికారులు ఆమెను చూసి నేర్చుకోవాలని హితవు పలుకుతున్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: