టీమిండియా చరిత్రలో గొప్ప ఆటగాడిగా పేజీలు లిఖించుకున్న ధోని కెరియర్  ప్రస్తుతం ప్రశ్నార్థకం గా మారిపోయింది. టీమిండియా క్రికెట్ చరిత్రలోనే బెస్ట్ ఫినిషర్ గా పేరు తెచ్చుకున్న ధోని ప్రస్తుతం క్రికెట్ కు దూరంగా ఉండడంతో జట్టులో అతని స్థానం కూడా అయోమయంలో పడిపోయింది. 2019 ప్రపంచకప్ తర్వాత ధోనీ పూర్తిగా క్రికెట్కు దూరం గా ఉండటం తో ప్రస్తుతం ధోనీ రిటైర్మెంట్ కు సంబంధించిన వార్త ప్రతిరోజు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎంతో మంది ప్రముఖులు సైతం ధోనీ రిటైర్మెంట్ పై స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే భారత మాజీలు సహా ఇతర విదేశాల క్రికెటర్లు కూడా ధోని భవితవ్యంపై స్పందించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

 

 

 ఇక తాజాగా ధోని కెరీర్ గురించి టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ జరగకపోతే టీమిండియాలో ధోని పునరాగమనం చేయడం చాలా కష్టం అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు గంబీర్.  ఒకటిన్నర సంవత్సరాల కాలంలోనే ధోని ఎక్కడ  బరిలోకి దిగింది లేదని అందువల్ల అతడు ఆటతీరును... సెలెక్టర్లు అంచనా వేయాలి అంటే  ఐపీఎల్లో ధోని ఆట చూడాల్సిందే అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒకవేళ ఐపీఎల్ రద్దు అయితే మాత్రం ధోని కి ఉన్న అవకాశాలు అన్ని సన్నగిల్లి పోయినట్లు అవుతందని  తెలిపాడు గౌతం గంభీర్. అయితే ధోనికి  కె.ఎల్.రాహుల్ ప్రత్యామ్నాయంగా భావించవచ్చు అంటూ తెలిపిన గౌతం గంభీర్.. ధోని అంత చక్కగా వికెట్ కీపింగ్ చేయక పోయినప్పటికీ.. టి20 క్రికెట్ లో ఏ స్థానంలో  లో అయిన  తనదైన శైలిలో అద్భుత ప్రదర్శన చేస్తూ సత్తా చాటుతున్నాడు అంటూ తెలిపారు. 

 

 

 ఇక తన కెరీర్ కు ఎప్పుడు వీడ్కోలు  పలకాలి అన్నది మాత్రం ధోని వ్యక్తిగత విషయం అంటూ  అభిప్రాయం వ్యక్తం చేశారు గౌతం గంభీర్. అయితే అటు అభిమానులు క్రికెట్ ప్రేక్షకుల్లో కూడా తన కెరీర్ పై ప్రశ్న నెలకొన్న విషయం తెలిసిందే. ఎందుకంటే గత కొంతకాలంగా క్రికెట్ పూర్తిగా దూరంగా ఉంటున్న మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ సత్తా చాటి 2020 ప్రపంచ కప్ కోసం భారత జట్టులో స్థానం సంపాదిస్తాడు అని అందరూ అనుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు కరోనా  వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న కారణంగా ప్రస్తుతం ఐపీఎల్ రద్దు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఐపీఎల్ నిజంగానే రద్దవుతే  ధోని కెరీర్ అయోమయంలో పడినట్లే అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: