క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తిని అరిక‌ట్టేందుకు ప్రధానమంత్రి న‌రేంద్ర‌ మోడీ ఏప్రిల్ 14వ తేదీ వ‌ర‌కు లాక్ డౌన్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. లాక్ డౌన్ 2.oలో దేశ ఆర్ధిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని లాక్ డౌన్ కొంత వరకు సడలించే అవకాశం ఉన్నటు తెలుస్తోంది. మినహాయింపు ఇచ్చేవాటిలో పరిశ్రమలు, నిత్యావసరాల సరుకులు అమ్మే దుకాణాల సమయం పొడిగించే అవకాశం ఉంది. అయితే, ఈ లాక్‌డౌన్‌ స‌మ‌యంలో ప్ర‌జ‌లు ఎదుర్కుంటున్న క‌ష్టాలు చూస్తుంటే..క‌న్నీరు ఆగ‌ని ప‌రిస్థితి. ఉదయం 6 గంటల నుంచి భోజనం కోసం భారీ క్యూ ఉంటున్న ప‌రిస్థితి కొన్ని న‌గ‌రాల్లో క‌నిపిస్తోంది.

 


లాక్‌డౌన్ వ‌ల్ల ప్ర‌ధానంగా బాధితులుగా మారింది వ‌ల‌స కార్మికులు. దేశ రాజధాని ఢిల్లీలో వలస కార్మికులు అత్యధికంగా ఉన్న సంగతి తెలిసిందే. అక్కడి వలస ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఢిల్లీలో నిత్యం వలస కార్మికులకు భోజనం అందిస్తున్నారు. అయితే, ఈ భోజనం కోసం పెద్ద ఎత్తున వలస కార్మికులకు అందిస్తున్నారు. అయితే, ఈ భోజనం కోసం పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు వ‌స్తున్నారు. ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి పెద్ద ఎత్తున క్యూలు కడుతున్నారు.  ఒక్కో చోట 1200 మంది వరకు నిలబడుతున్నారు. అలా ఉద‌యం నుంచే పొట్ట చేత ప‌ట్టుకున్న వారి ప‌రిస్థితిని చూసిన వారు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

 

ఇదిలాఉండ‌గా, భారత్‌లో తొలి విడత లాక్‌డౌన్ నేడు ముగిసిపోనుంది. దీని కొనసాగింపునకు సంబంధించి సోమవారం ప్రధాని స్పష్టమైన ప్రకటన చేయాల్సింది. ఇందుకోసం ఆయన దాదాపు వారం రోజులుగా కసరత్తులు చేస్తున్నారు. భారత్‌లో కోవిడ్‌ 19 కేసుల సంఖ్య, మరణాలు ఇతర దేశాల్తో పోలిస్తే తక్కువే అయినప్పటికీ నియంత్రణ చర్యల విషయంలో ఏ చిన్న లోటుపాట్లకు కేంద్రం సాహసించడం లేదు. దేశంలో ఈ వ్యాధి విస్తరించే అవకాశాల్ని పసిగట్టిన వెంటనే జనతాకర్ఫ్యూకు ప్రధాని పిలుపునిచ్చారు. దీనికి ప్రజల్నుంచి వచ్చిన స్పందనతో దీర్ఘకాల లాక్‌డౌన్‌కు భారత్‌ సంసిద్దంగా ఉన్నట్లు గుర్తించారు. ఒకరోజు వ్యత్యాసంతో 21రోజుల లాక్‌డౌన్‌కు పిలుపు ఇచ్చారు. అయితే లాక్‌డౌన్‌ ఉపసంహరణ లేదా కొనసాగింపునకు సంబంధించి గతంలోలా కేంద్రం ఏకపక్ష నిర్ణయం తీసుకునేందుకిప్పుడు సాహసించడంలేదు. దేశంలోని అన్ని పక్షాలు, వర్గాల సూచనలకనుగుణంగా ముందడుగేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం ప్రధాని మోడీ ఇప్పటికే రెండుసార్లు దేశంలోని ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్‌ గవర్నర్లందరితో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అందరి ఆలోచనల్ని తెలుసుకున్నారు. అలాగే పార్లమెంట్‌లో ఐదుగురికి మించి సభ్యులుగల అన్ని రాజకీయ పార్టీల అధినేతల్తోనూ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. మాజీ ప్రధానులు, దేశాధ్యక్షుల సలహాలు స్వీకరించారు. తిరిగి కేంద్ర కేబినెట్‌ సహచరుల అభిప్రాయాల్ని తెలుసుకున్నారు. ఈ మేర‌కు నేడు ప్ర‌క‌ట‌న చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: