ప్రస్తుతం భారతదేశంలో కరోనా వైరస్  భయం పట్టుకున్న విషయం తెలిసిందే. కనిపించకుండా దాడిచేసి కాటికీ  పంపిస్తున్నా మృత్యువు ఎక్కడి నుంచి  దాడి  చేస్తుందో అనే  భయంతో ని బతుకుతున్నారు ప్రస్తుతం అందరూ. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరూలో  ఈ మహమ్మారి భయం కనిపిస్తుంది. ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు కూడా ఈ వైరస్ భారిన పడి  చికిత్స తీసుకుంటున్న  విషయం తెలిసిందే. ధనిక పేద అనే తేడా లేకుండా సామాన్యులు సెలబ్రిటీలు అనే తారతమ్యం లేకుండా అందరికీ ప్రబలుతు  మరణ భయాన్ని కలిగిస్తుంది కరోనా  వైరస్. ఇక దేశ వ్యాప్తంగా  రోజురోజుకు మహమ్మారి వైరస్ ప్రభావం కూడా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. 

 

 

 అయితే అప్పుడు వరకు తాము కలిసిన  వారికి కరోనా  వైరస్ సోకింది అంటే మిగతా వారు కూడా క్వారంటైన్ లోకి  వెళ్ళిపోతూ కరోనా  వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేస్తున్న విషయం తెలిసిందే.ఇక్కడో మంత్రి అదే చేసాడు. ఓ  పోలీస్ కారణంగా క్వారంటైన్ కు  వెళ్లాల్సి వచ్చింది. మహా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జితేంద్ర ఆవ్హద్  సోమవారం స్వీయ  లోకి వెళ్ళిపోయారు. ఈ మధ్యకాలంలో ఆయన కలిసిన పోలీస్ అధికారి కి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్రలోని థానే జిల్లా కల్వ ముంబ్రా  అసెంబ్లీ నియోజకవర్గానికి జితేంద్ర ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 

 

 

 అయితే గత కొన్ని రోజుల క్రితం ఆయన ఓ పోలీసు అధికారిణికి కలిశారు. కాగా  ప్రస్తుతం ఆ అధికారికి  కరోనా  వైరస్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో వెంటనే అప్రమత్తం అయిన మంత్రి జితేంద్ర స్వీయ  నిర్బంధంలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్  సమయంలో  ప్రజలెవరూ ఇల్లు దాటి బయటకు రావద్దు అంటు  ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఇదిలా ఉంటే దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా  వైరస్ కేసు నమోదైన విషయం తెలిసిందే. మొత్తంగా  1982 మందికి కరోనా  వైరస్ బారిన పడ్డారు మహారాష్ట్రలో . 150 మంది మృతి చెందారు.

మరింత సమాచారం తెలుసుకోండి: