ఢిల్లీకి చెందిన ఓ ప్రబుద్ధుడు తాను ఐఏఎస్‌ అధికారినంటూ నాటకమాడి పోలీసులకు అడ్డంగా బుక్క‌య్యాడు. దీంతో కేటుగాడిని  అరెస్టు చేసి స్టేషనుకు తరలించారు. ఈ ఘటన వాయువ్య ఢిల్లీలో జ‌రిగింది. దేశ వ్యాప్తంగా క‌రోనా విస్త‌రిస్తున్న వేళ కొంత‌మంది మాత్రం అన‌వ‌స‌రంగా రోడ్ల‌పైకి వ‌స్తున్నారు. లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తున్నారు. పోలీసుల క‌న్నుగ‌ప్పిపారిపోయేందుకు య‌త్నిస్తు న్నారు. అయితే ఈక్ర‌మంలో కొంత‌మంది దొరికిపోతూనే ఉన్నారు. ఢిల్లీలో కూడా ఐఏ ఎస్‌నంటూ ఓ యువ‌కుడు చేసిన ప్ర‌య‌త్నం చివ‌రికి విఫ‌ల‌మ‌వ‌డ‌మే కాదు చివ‌రికి జైలుకు వెళ్లాల్సి వ‌చ్చింది. 


స‌ద‌రు యువ‌కుడు సోమవారం  కారులో బయల్దేరి రోడ్లపైకి వ‌చ్చాడు. పోలీసు బారికేడ్లను దాటుకుని వెళ్లేందుకు ప్రయత్నిం చాడు. ఈ క్రమంలో అతడిని అడ్డగించిన పోలీసులకు తాను 2009 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన అధికారినని న‌మ్మ‌బ‌లికాడు. ప్రస్తుతం హోం మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్నానని పోలీసుల‌కు చెప్పాడు. దీనికి సంబంధించిన  స్టిక్కర్లను కూడా కారుకు అంటించి ఉండ‌టాన్ని చూపించాడు. అయితే ఎందుకో పోలీసుల‌కు న‌మ్మ‌కం క‌ల‌గ‌లేదు. మ‌రికొన్ని వివ‌రాలు అడుగుతుండ‌గానే  స‌ద‌రు యువ‌కుడు వారిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. ఏంటీ ఓ ఐఏ ఎస్‌ను ఇంత‌సేపు రోడ్డుపై నిల‌బెడ‌తారా..? అంటూ మండిప‌డ్డారు.

 

 అయితే పోలీసులు వెన‌క్కు త‌గ్గ‌కుండా ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించి చివ‌రికి మ‌నోడు న‌కిలీ ఐఏ ఎస్ అన్న విష‌యాన్ని నిర్ధారించుకున్నాక అరెస్టు చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు.  కారును సీజ్‌ చేశారు. ఇక గుజరాత్‌లోని భావ్‌నగర్‌లోనూ ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. తాను ప్రభుత్వోద్యోగినని అబద్ధం చెప్పి.. ఓ వ్యక్తి తన భార్య, కూతురితో బంధువుల ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో చిన్నారికి కరోనా సోకడంతో తల్లిదండ్రులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండ‌గా కరోనా కేసులు రోజురోజుకీ విజృంభిస్తున్న తరుణంలో మంగళవారం(ఏప్రిల్‌ 14)న ముగియాల్సిన లాక్‌డౌన్‌ను పొడగించే అంశమై ప్రధాని నరంద్ర మోదీ రేపు కీలక ప్రకటన చేయనున్నారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: