వైద్యం, స్వచ్ఛంద సేవ, ప్రభుత్వ విధులు, అత్యవసర సేవల కోసం వెళ్లే కొంతమంది లాక్‌డౌన్ నిబంధ‌న‌ల నుంచి మిన‌హాయింపు ఇవ్వాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం. అత్య‌వ‌స‌రంగా వెళ్లేవారికోసం పాసులు జారీ చేస్తామ‌ని డీజీపీ కార్యాల‌య అధికారులు సోమ‌వారం ఒక ప్ర‌క‌ట‌నను జారీ చేశారు. కరోనా లాక్‌డౌన్‌ను ప్రజలంతా పక్కాగా పాటిస్తున్నారని రాష్ట్ర పోలీసు శాఖ నివేదిక స‌మ‌ర్పించ‌డంతో ప్ర‌భుత్వం కొంత స‌డ‌లింపు ఇవ్వాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.  ప్రభుత్వ ఆదేశాల మేరకు పాసుల జారీకి అన్ని చర్యలు తీసుకున్నామని పోలీసు వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. 


పాసులు కావాలనుకునేవారు.. 1.పేరు, పూర్తి చిరునామా, 2.ఆధార్‌ కార్డు వివరాలు, 3.ప్రయాణించే వాహనం నెంబర్‌,  ప్రయాణికుల సంఖ్య,  ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించాలనే పూర్తి వివరాలు సమర్పించాలి. అన్ని పత్రాలను పరిశీలించిన తరువాత సాద్యమైనంత త్వరగా సంబంధిత పోలీసు అధికారులు పాసులు చేయ‌నున్నారు. అవ‌స‌రం లేకున్నా కేవ‌లం తిర‌గ‌టానికి పాసులు పొందాల‌నుకునే వారికి మాత్రం క‌ఠిన శిక్ష‌లుంటాయ‌ని పోలీసులు హెచ్చ‌రిస్తున్నారు. కోవిడ్‌-19 ఎమర్జెన్సీ వెహికల్‌ పాసులు కావాలనుకునే ప్రజలు నేరుగా ద‌గ్గ‌ర‌లోని పోలీస్‌స్టేష‌న్‌కు వెళ్లాల‌ని, అక్క‌డి సిబ్బంది పాస్ పొందే విధానంపై గైడ్ చేస్తార‌ని డీజీపీ కార్యాల‌యం అధికారులు ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. 


ఇదిలా ఉండ‌గా లాక్‌డౌన్ గడువు ముగియనున్న ప్రస్తుత తరుణంలో ఆంధ్రప్రదేశ్‌లో ఏఏ ప్రాంతాలు ఏఏ జోన్లలోకి వస్తాయన్న చర్చ ఆసక్తి రేపుతోంది. రాష్ట్రంలోని మూడు జిల్లాలను గతంలో కేంద్ర ప్రభుత్వం రెడ్ జోన్లో చేర్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ జిల్లా కేంద్రాలు రెడ్ జోన్ పరిధిలోకి రానున్నాయి. ఆ జిల్లా కేంద్రాలతో పాటు వివిధ మండలాలు కూడా రెడ్ జోన్ పరిధిలోకి రానున్నాయి. రెడ్‌జోన్ల ప‌రిధిలో రాష్ట్ర వ్యాప్తంగా 676 మండలాలు ఉన్నాయి. గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్టు కర్నూలు, నెల్లూరు, గుంటూరు, విశాఖపట్టణం జిల్లా కేంద్రాలతో పాటు, విజయవాడ పట్టణం రెడ్ జోన్‌లో ఉన్నాయి.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: