చైనాలోని వూహాన్‌లో పుట్టిన కోరోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్ని కుదిపేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర మంలో ప్ర‌జ‌ల ఆరోగ్య‌మే కాదు.. ఆర్ధిక ప‌రిస్థితి కూడా తీవ్ర‌స్థాయిలో దెబ్బ‌తింటోంది. లాక్‌డౌన్ కార‌ణంగా అన్ని ప‌రిశ్ర‌మ‌లు, కంపెనీలు మూత‌బ‌డ్డాయి. దీంతో దేశ‌వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఉపాధి కోల్పోయారు. వ‌ల‌స కూలీలు కూడా ప‌నులు లేక‌.. ఇంటి ముఖం ప‌ట్టారు. నిజానికి గ‌తంలోనూ అనేక వ్యాధులు వ‌చ్చా యి. అనేక వ్యాధులు ప్ర‌జ‌ల ప్రాణాల‌ను క‌బ‌ళించాయి. కానీ, ఇలా ఆర్ధిక వ్య‌వ‌స్థ‌ల‌ను కూడా కూక‌టి వేళ్ల‌తో పెక‌లించే ప‌రిస్థితి మాత్రం ఒక్క క‌రోనా వ‌ల్లే వ‌చ్చింది.,

 

క‌రోనా కేవ‌లం మ‌నుషుల ఆరోగ్యం, ప్రాణాల‌తోనే ఆడుకోవ‌డం లేదు. దేశాల ఆర్ధిక వ్య‌వ‌స్థ‌ల‌ను కూడా కు ప్పకూల్చేస్తోంది. ప్ర‌త్య‌క్షంగా మ‌నుషుల‌పై క‌రోనా ఎఫెక్ట్ చూపిస్తున్నా.. ప‌రోక్షంగా అందుకు నాలుగింత లు ఆర్ధికంగా భారాల‌ను కూడా మోపేసింది. ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా లాక్‌డౌన్ ను కొన‌సాగిస్తున్నారు. క‌రోనా లేని దేశం.. లాక్‌డౌన్ లేని ప్రాంతం అంటూ ఎక్క‌డా క‌నిపించ‌డం లేదంటే అతిశ‌యోక్తి అనిపి స్తుంది. అయినా నిజం. స‌రే! ఈ ప‌రిస్థితి ఎన్నాళ్లు? అంటే.. ప్ర‌స్తుతం క‌రోనా ఉంది కాబ‌ట్టి.. ఇప్పుడు ఉంద‌ని అనుకునే అవ‌కాశం లేదు.

 

ప్ర‌స్తుతం మ‌న‌కు ప్ర‌త్య‌క్షంగా క‌నిపిస్తున్న ఈ ప‌రిస్థితి క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్ని వీడిపోయిన త‌ర్వా త కూడా కొన‌సాగుతుంద‌ని ఆర్ధిక నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. క‌రోనా కేసులు త‌గ్గిపోయి. క‌ట్ట‌డి అయింద‌ని భావించి, లాక్‌డౌన్‌ను ఎత్తేసిన త‌ర్వాత నుంచి క‌నీసంలో క‌నీసం ఆరు నెలల‌ నుంచి  ఏడాది పాటు క‌రోనా ఎఫెక్ట్ ప్ర‌బ‌లంగా ఉంటుంద‌ని చెబుతున్నారు. ఇది అప్పుడు ప్ర‌త్య‌క్షంగా ప్ర‌భావం చూపుతుంద‌ని చెబుతున్నారు. దేశంలో ఆక‌లి కేక‌లు పెర‌గ‌డంతో పాటు.. నిరుద్యోగం భారీ ఎత్తున క‌నిపిస్తుంద‌ని అంటున్నారు. సో.. ఇప్ప‌టి నుంచే ప్ర‌జ‌లు ముందు జాగ్ర‌త్త‌లు పాటించాల‌నేది నిపుణుల మాట‌!!

మరింత సమాచారం తెలుసుకోండి: