అపర చాణక్యుడిగా రాజకీయాల్లో పేరున్న చంద్రబాబు కూడా ప్రస్తుతం కుర్ర నాయకుడు జగన్ చేతిలో బాగా ఇబ్బంది పడుతున్నారు. తన రాజకీయ జీవితంలోనే అత్యంత దారుణమైన ఓటమి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు ఎదురైంది. ఆ దెబ్బల నుంచి కోలుకుంటూ మళ్లీ తనదైన రాజకీయం ప్రారంభించారు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు.

 

అలాంటి నాయకుడికి ఇప్పుడు కరోనా రూపంలో అవకాశం వచ్చిందని సంబరపడుతున్నారు. ఈ సమయంలో తాను ముఖ్యమంత్రిగా ఉంటేనా.. అంటూ సొంత మీడియా గ్రూపుల్లో ప్రచారం చేయించుకుంటున్నారు. దేశ వ్యాప్త కరోనా సంక్షోభాన్ని కూడా తన రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారు. అందరికి టెస్టులు చేయడం లేదని, నిజాలు చెప్పడం లేదని ఆరోపణలు చేస్తూ తన వర్గం మీడియాలో ప్రచారం చేయిస్తున్నారు.

 

 

మరో విషయం గమనించారా.. ప్రధాని మోడీని ఎన్నికల ముందు బండబూతులు తిట్టిన చంద్రబాబు ఇప్పుడు ఆయనను ఒక్క మాట అనే సాహసం చేయడం లేదు. చివరికి కరోనా కాలంలో వైసీపీ నేతలు చేస్తున్న సాయాన్ని కూడా ఎన్నికల ప్రచారం చేస్తున్నారన్న ప్రచారంతో ఆపేయించే ప్రయత్నం చేస్తున్నారు. అటు సిపిఐ నేత రామకృష్ణ, ఇటు బిజెపి అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణలతో కూటమిగా తయారై జగన్ సర్కారును ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

 

 

జగన్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు హైదరాబాద్ లో ఉండేవారు.. అప్పుడు చంద్రబాబు, టిడిపి నేతలు, తెలుగుదేశం మీడియా ఘోరంగా ప్రచారం చేసింది. జగన్ కు ఏపీ పట్టదని దుష్ప్రచారం సాగించారు. కానీ ఇప్పుుడు అదే చంద్రబాబు ఇంత కరోనా సంక్షోభంలోనూ తన హైదరాబాద్ బంగళా నుంచి బయటకు రావడం లేదు. అక్కడ నుంచి నిత్యం మీడియా సమావేశాల పేరుతో లైవ్ లో గంటల తరబడి ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇదీ చంద్రబాబు మార్కు రాజకీయం అంటే.

మరింత సమాచారం తెలుసుకోండి: