కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా రోజూ 5 వేల మంది వరకూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటి వరకూ ఈ మహమ్మారి లక్ష మందికిపైగా పొట్టన పెట్టుకుంది. రోజూ రెండు లక్షల మంది వరకూ వ్యాపిస్తోంది. అయితే విదేశాలతో పోలిస్తే ఇండియాపై ప్రభావం కాస్త తక్కువే. ఇలా ఎందుకు జరుగుతోందన్న దానిపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.

 

 

తాజాగా అందుతున్న గుడ్ న్యూస్ ఏంటంటే.. యూరప్, అమెరికా దేశాల్లో విస్తరించిన వైరస్ జన్యు పరంగా చాల డిఫెరెంట్ గా ఉందట. అది చాలా బలంగా ఉందట. అందుకే ఈ వైరస్ వలన ఆయా దేశాల్లో మరణాల సంఖ్య అధికంగా ఉంది. కానీ ఇండియాలో వ్యాపించిన కరోనా వైరస్ జన్యువులు బలహీనంగా ఉన్నాయట. అందుకే వ్యాప్తి నెమ్మదిగా ఉందట.

 

 

అందుకే ఈ కరోనా వైర్ ఇండియాలో ఇది పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 2019 లో చైనాలోని వుహాన్ నగరంలో కరోనా వైరస్ మొదటిసారి బయటపడింది. అక్కడి వైరస్ ను పరిశీలించగా వైరస్ చుట్టూ కిరీటాలు వంటి ముళ్ళు ఉన్నాయని, అందుకే దీనికి కరోనా అనే పేరుపెట్టినట్టు శాస్త్రవేత్తలు అప్పట్లో తెలిపారు.

 

 

వుహాన్ నగరంలో బయటపడినప్పటి నుంచి మార్చి వరకు ఈ వైరస్ ని జన్యువులలో మూడు రకాల మార్పులు చెందింది. వీటికి ఏ,బి,సి అనే పేర్లు పెట్టారు. మొదటి గ్రూప్ కు చెందిన వైరస్ ను వుహాన్ నగరంలో గుర్తించారు. అక్కడి నుంచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలకు పాకింది. అక్కడ ఈ వైరస్ జన్యువుల్లో రెండు రకాల మార్పులు చోటు చేసుకుంది. ఆ తరువాత అక్కడి నుంచి చైనాకు అక్కడి నుంచి యూరప్, అమెరికాకు ఈ వైరస్ విస్తరించింది. యూరప్, అమెరికాలో విస్తరించిన వైరస్ లోని జన్యువుల్లో మరిన్ని మార్పులు జరిగినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ మార్పుల్లో భాగంగానే ఇండియాకు వచ్చిన వైరస్‌ అంత బలంగా లేదని చెబుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: