కరోనా వైరస్ వచ్చిన నాటి నుండి ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు టార్గెట్ 'జగన్' అన్నట్టుగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా రాణించిన చంద్రబాబు ప్రస్తుతం కరోనా వైరస్ ఎఫెక్టుతో హైదరాబాద్ నగరంలో ఉన్న నివాసంలో ఉన్నారు. అయితే ఈ సందర్భంలో మాత్రం ఎక్కడా కూడా కే‌సి‌ఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా జగన్ ని టార్గెట్ చేస్తూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నిర్ణయాలను సూచనలను జగన్ తీసుకోవడం లేదని మొన్న సీరియస్ అయ్యారు. ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పరిస్థితి గురించి లేఖల మీద లేఖలు జగన్ కి చంద్రబాబు రాస్తున్నారు.

 

కరోనా వైరస్ వల్ల దేశంలో మరియు ప్రపంచంలో ఉన్న పరిస్థితులను గురించి ఏ మాత్రం ప్రస్తావించకుండా ఏపీలో మాత్రమే కరోనా వైరస్ ఉంది అన్నట్టు చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం తాను ఉన్న హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అక్కడ పరిస్థితి గురించి కూడా ప్రశ్నించడానికి ఇష్టపడటం లేదు చంద్రబాబు. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ఎఫెక్ట్ వల్ల పేదలకు 1500 రూపాయలు ఇస్తే ఏం మాట్లాడని చంద్రబాబు, ఏపీలో మాత్రం కరోనా వైరస్ ఎఫెక్ట్ వల్ల పేదలకు ఐదువేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అసలు చంద్రబాబు 2015 నుండి కే‌సి‌ఆర్ ఈ విషయంలో ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేక పోతున్నారు అన్న సందేహం ప్రస్తుతం ప్రతి ఒక్కరిలో నెలకొంటుంది.

 

మామూలుగా అయితే చంద్రబాబు 2014 సార్వత్రిక ఎన్నికల టైంలో ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత కే‌సి‌ఆర్ తో నువ్వా నేనా అన్నట్టు గా వ్యవహరించారు. అలా బహిరంగ వేదికలపై తెలంగాణ సీఎం కే‌సి‌ఆర్ నీ చెడుగుడు ఆడేసుకున్నారు. అయితే గత కొన్ని సంవత్సరాల నుండి చంద్రబాబు ఒక్కటంటే ఒక్క మాట కూడా కే‌సి‌ఆర్ పై మాట్లాడిన దాఖలాలు లేవు. ఇటువంటి కరోనా వైరస్ విపత్కర టైములో ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రజ సమస్యల పైన మాట్లాడాలని చాలామంది కోరుతున్నారు.

 

కేవలం ఏపీకి ప్రతిపక్ష నేతగా ఉండటం వల్ల ఏపీ కే పరిమితం కాకూడదని.. 40 ఏళ్ల రాజకీయ అనుభవం, మూడు సంవత్సరాలు ముఖ్యమంత్రి పరిపాలన చేసిన చంద్రబాబు తెలుగు రాష్ట్రాలలో ప్రతి సమస్యపై ప్రతి స్పందించాలని తెలుగు ప్రజలు కోరుతున్నారు. మరోపక్క కేసీఆర్ ని చంద్రబాబు ప్రశ్నించకపోవడం వెనుక భిన్నమైన కామెంట్లు వినపడుతున్నాయి. ఓటుకు నోటు కేసు భయంతోనే చంద్రబాబు కే‌సి‌ఆర్ నీ ప్రశ్నించ లేకపోతున్నారు అని అంటున్నారు. ఒకవేళ చంద్రబాబు నోరు విప్పితే కే‌సి‌ఆర్ మళ్లీ ఆ కేసు బయటికి తీస్తారు ఏమో అన్న భయంతో ఒక్క మాట కూడా మాట్లాడలేక పోతున్నారు చంద్రబాబు అని ఏపీలో ఉన్న వైసీపీ నేతలు అంటున్నారు. 

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: