భారత ప్రధాని  నరేంద్ర మోడీ స్టైలే డిఫరెంట్ గా ఉంటుంది. ఆయన ఒక పట్టాన ఎవరి ఊహాలకు అర్ధం కాడు. ఆయన రాజకీయమంతా కూడా వేరేగా ఉంటుంది. పక్క ప్లాన్ తో సరికొత్త వ్యూహాలను అనుసరిస్తూ పోతుంది.  అందుకే ఆయన రాజకీయాల్లో అజేయుడిగా నిలిచారు.

 

ఇదిలా ఉండగా లాక్ డౌన్ విషయంలొ దేశంలో మెజారిటీ  ముఖ్యమంత్రులందరూ ఈ నెలాఖరు వరకూ కొనగించాలని  కోరారు. జగన్ మాత్రం లాక్ డౌన్ సడలింపునే కోరుకున్నారు. ఇది పెద్ద చర్చకు దారి తీసింది. జగన్ కి ప్రజల ప్రాణాల మీద అభిమానం, జాలి, శ్రధ్ధ లేవని విపక్షాలు అపుడే ఓ వైపు  విరుచుకుపడుతున్నాయి. 

 

మరో వైపు చూసుకుంటే జగన్ అన్న మాటనే వేరే విధంగా ప్రధాని మోడీ కూడా వినిపించడం విశేషం. బతకడమే కాదు, జీవిత చక్రం కూడా నడవాలి  అని మోడీ చెబుతున్నారు. అంటే ఆర్ధిక వ్యవస్థ కూడా గాడిన పడాలని ఆయన కోరుకుంటున్నారు. అదే మాట జగన్ కూడా చెబుతున్నారు.

 

ఈ విధంగా జగన్ మాటకు ప్రధాని మోడీ మద్దతు  ఇచ్చినట్లుగా సీన్ కనిపిస్తొంది. మరో వైపు చూసుకుంటే అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ సైతం ఇదే భావనను వినిపించింది. ప్రజల జీవన పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని భారత్ లో  లాక్ డౌన్ రెండవ విడత అమలు చేయాల్సి ఉంటుందని కూడా చెప్పుకొచ్చింది. 

 

మొత్తం మీద చూస్తే ఆర్ధిక వేత్తలు, నిపుణులు ఇదే రకమైన అభిప్రాయంతో ఉన్నారు. మరి ప్రధాని రేపు చేసే ప్రసంగంలో కూడా సడలింపు మీద ఇదే రకమైన అభిప్రాయాలు ఉంటే మాత్రం జగన్ కి పూర్తి మద్దతు లభించినట్లే. జగన్ అందరిలా ప్రచారం చేసుకోకపోయినా తనదైన రాజకీయం, దూర ద్రుష్టి, సమాజాభివ్రుద్ధి పట్ల ఉన్న చిత్తశుధ్ధిని నాడు లోకం మొత్తం చూస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: