కరోనా వైరస్ వల్ల ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. చైనా దేశంలో పుట్టిన ఈ వైరస్ యూరప్ మరియు అమెరికా దేశాలలో చాలా భయంకరంగా మారింది. ఈ వైరస్ వల్ల వేలల్లో మరణాలు సంభవిస్తుందో లక్షల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా ఈ వైరస్ ను ఎదుర్కోలేక నానా తిప్పలు పడుతోంది. మొన్నటిదాకా పాజిటివ్ కేసుల్లో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్న అమెరికా ఇప్పుడు మరణాల సంఖ్య విషయంలో ఇటలీని దాటుకొని ముందుకు వెళ్ళి పోయింది. దీంతో రాబోయే రోజుల్లో అమెరికా కరోనా వైరస్ వల్ల చాలా మూల్యం చెల్లించుకునే పరిస్థితి ఉందని చాలామంది అంటున్నారు.

 

ఇదిలా ఉండగా బ్రిటన్ దేశంలో కూడా పరిస్థితి దారుణంగా ఉంది. రోజురోజుకీ పాజిటివ్ కేసులు నమోదు కావడంతో బ్రిటన్ దేశంలో వైద్యులు వినూత్నంగా వ్యవహరిస్తున్నారని అంతర్జాతీయ స్థాయిలో వార్తలు వస్తున్నాయి.  బ్రిటన్ లోని ఆసుపత్రుల్లో బెడ్లు మూడింట రెండు వంతులు కరోనా వైరస్ బాధితులతో నిండినట్లు చెబుతున్నారు. ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే హాస్పిటల్ కి కరోనా వైరస్ రోగుల తాకిడి ఎక్కువవడంతో అత్యవసర కేసులను మాత్రమే రైతులు టేకప్ చేస్తున్నారట. దాదాపు చనిపోతారు అని డిసైడ్ అయిన రోగులను అలాగే వదిలేస్తున్నారు.

 

కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి బతికే అవకాశం పెద్దగా లేని వారిని పక్కన పెట్టేస్తున్నారు అంట బ్రిటన్ వైద్యులు. దీంతో కళ్ళముందే వైద్యం చేసి కాపాడాల్సిన రోగులు బ్రిటన్ వైద్యుల కళ్ళముందే చనిపోవడంతో...శవాలను చూసి వైద్యులు తెగ బాధపడిపోతున్నారు. అంతేకాకుండా హాస్పిటల్ కి వెళ్లక ముందు బ్రిటన్ వైద్యులు వీలునామాలు రాసేసి అప్పుడు వైద్యసేవలు అందించడానికి వెళ్తున్నారంట. ఇంకా రకరకాల అవస్థలు బ్రిటన్ వైద్యులు పడుతున్నట్టు సమాచారం. ఒక వైద్యుడి జీవితంలో ఇంతకంటే దారుణమైన బాధాకరమైన సిచువేషన్ మరొకటి ఉండదని..బ్రిటన్ లో నెలకొన్న పరిస్థితులపై అంతర్జాతీయ మీడియా కామెంట్ చేస్తోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: