భార‌త ప్ర‌జ‌లంతా ప్ర‌ధాన‌మంత్రి మోదీ రేపు చేయ‌బోయే ప్ర‌క‌ట‌న‌పై ఎంతో ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్నారు. లాక్‌డౌన్ కొన‌సాగిస్తారా..? లేక ఎత్తివేస్తారా..?  పాక్షికంగా అమ‌లుకు ఆదేశాలు చేస్తారా..? కొన్ని మౌలిక రంగాల‌కు మిన‌హాయింపునిస్తూ లాక్‌డౌన్‌ను య‌థాత‌థంగా కొన‌సాగించాల‌ని చెబుతారా అన్న‌ది రేపు తెలియ‌జేయ‌నున్నారు. ఇలాంటి స‌మ‌యంలో కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ మోదీకి ట్విట్ట‌ర్ వేదిక‌గా కొన్ని కీల‌క సూచ‌న‌లు చేశారు. లాక్‌డౌన్ కొన‌సాగిస్తూనే అవ‌స‌రం లేని చోట్ల ఎత్తివేయాల‌ని ఆయ‌న వ్యాఖ్య‌ల సారాంశం.  అన్ని రంగాలపై ఒకేసారి లాక్‌డౌన్ విధించ‌డం వ‌ల్ల అనేక కొత్త క‌ష్టాలు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. 

 


ముఖ్యంగా  రైతులు, దినసరి కూలీలు, వలస కార్మికులు, చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. లాక్‌డౌన్‌ను తెలివిగా  అప్‌గ్రేడ్ చేయాలని అభిప్రాయపడ్డారు. నిరంత పరీక్షలతో పాటు కరోనా హాట్‌స్పాట్‌లను ఐసోలేట్ చేయాలని అన్నారు. అంతేకాదు వైరస్ ప్రభావం లేని ప్రాంతాల్లో వ్యాపారాలు చేసుకునేందుకు వీలు క‌ల్పించాల‌ని కోరారు.  ఇదిలా ఉండ‌గా ఇటీవల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ.. ప్రజల ప్రాణాలతో పాటు ప్రపంచమూ ముఖ్యమనే వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 15 నుంచి పలు రంగాలకు మినహాయింపు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. 

 

కరోనా తీవ్రతను బట్టి దేశాన్ని రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్‌లుగా విభజిస్తారని.. దానికి అనుగుణంగా సడింపు ఉంటుందని సమాచారం.ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టికే కేంద్రం నిర్ణయంతో సంబంధం లేకుండా ఒడిశా, పంజాబ్, తెలంగాణ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను ఈ నెలాఖరు వరకు పొడిగించిన విష‌యం తెలిసిందే.  ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్ ఎత్తేసే ప్రసక్తే లేదని, ఒక‌వేళ వ్యాధి ప్ర‌బ‌లితే త‌మను బాధ్యుల‌ను చేయ‌వ‌ద్ద‌ని ఒక‌రిద్ద‌రు ముఖ్య‌మంత్రులు చెప్ప‌డం గ‌మ‌నార్హం.   అయితే  రెడ్ జోన్లలో మాత్రం లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేస్తారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రేపు ప్రధాని మోదీ ఏం ప్రకటిస్తారని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: