ఇండియాలో కరోనా కేసుల సంఖ్య 10000 కు చేరుకుంది. మహారాష్ట్ర తో పాటు ఢిల్లీ ,తమిళ నాడులో కేసుల సంఖ్య రోజు రోజు కి పెరుగుతుండడం తో దేశ వ్యాప్తంగా భారీగా కేసులు  నమోదవుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర ను కరోనా వణికిస్తోంది. ఇప్పటివరకు మహారాష్ట్ర లో కేసుల సంఖ్య 2000 దాటగా 100 మరణాలు సంభవించాయి. ఢిల్లీ , తమిళ నాడు లో కూడా 1000 కిపైగా కేసులు నమోదయ్యాయి. లాక్ డౌన్ విధించిన కూడా కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది.
 
మరోవైపు రేపటితో కేంద్రం విధించిన 21 రోజుల లాక్ డౌన్ గడువు  ముగియనుంది అయితే కేంద్రం తో సంబంధం లేకుండా ఇప్పటికే తమిళనాడు, ఒడిశా, పంజాబ్, తెలంగాణ, మహారాష్ట్ర , కర్ణాటక, పశ్చిమ బెంగాల్, మేఘాలయ రాష్ట్రాలు ఈనెల 30వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాయి. కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడం తో కేంద్రానికి  కూడా లాక్ డౌన్ పొడిగించక తప్పని పరిస్థితి. రేపు ఉదయం10 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జాతి నుద్దేశించి ప్రసంగించనున్నారు. దాంతో లాక్ డౌన్ విషయంలో స్పష్టత రానుంది. 
 
ఇక ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ కేసులు నమోదైన దేశాల జాబితాలో ఇండియా 21 స్థానంలో కొనసాగుతుంది. ఇలాగే కేసులు పెరుగుకుంటూ పోతే త్వరలోనే భారత్, సౌత్ కొరియా ను దాటేసి టాప్ 20 లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయం. కాగా అగ్ర రాజ్యం అమెరికా ఈ జాబితాలో మొదటి స్థానం లో వుంది. ఇప్పటివరకు అక్కడ కరోనా కేసుల సంఖ్య 5లక్షలు దాటింది. ఒక్క న్యూయార్క్ నగరం లోనే 10000 మరణాలు సంభవించగా ఇప్పటివరకు మొత్తం అమెరికాలో కరోనా మరణాల సంఖ్య 25000 దాటింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: