దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు అటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే 21 రోజుల లాక్ డౌన్ పాటించారు. ఇంకా కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు మరో రెండు వారాలు లాక్ డౌన్ కొనసాగించేందుకు చూస్తున్నారు. వీలుని బట్టి జోన్ల వారీగా లాక్ డౌన్ పెట్టే అవకాశముంది. ఇప్పటికే కేంద్రంతో సంబంధం లేకుండా 7 రాష్ట్రాలు లాక్ డౌన్ పొడిగించాయి.

 

అయితే కరోనా వ్యాప్తి ఎలా పెరుగుతుందో, దాని మీద రాజకీయం చేయడం కూడా అంతే స్థాయిలో ఉంటుంది. అటు కేంద్రంలో గానీ, ఇటు పలు రాష్ట్రాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలు కరోనా మీద రాజకీయం చేస్తున్నాయి. ఇక ఈ కరోనా రాజకీయానికి మధ్యప్రదేశ్ కూడా ఏమి అతీతంగా లేదు. అక్కడ కూడా అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

 

ఈ క్రమంలోనే మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ కమలనాథ్ఫిబ్రవరి 12న రాహుల్ గాంధీ కరోనాపై హెచ్చరించారని, ఆయన కేంద్రం పట్టించుకొలేదని బీజేపీ లక్ష్యంగా విమర్శలు చేశారు. ఇక దీనికి మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ కౌంటర్ ఇస్తూ, మార్చి 23 వరకు మీరు సీఎంగా ఉన్నారుగా, మీరు ఏమి చర్యలు తీసుకున్నారని కమలనాథ్ ని ప్రశ్నించారు.

 

అయితే మొన్నటివరకు మధ్యప్రదేశ్ సీఎంగా ఉన్న కమలనాథ్ ని, బీజేపీ పరోక్షంగా దెబ్బకొట్టి, కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి, కాంగ్రెస్ మెజారిటీ తగ్గించి, కమలనాథ్ ని గద్దె దించారు. అప్పుడు బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ ఉండటంతో శివరాజ్ సింగ్ చౌహన్ సీఎం పీఠం ఎక్కేసారు.

 

ఇక ఇక్కడ ఊహించని విషయం ఏంటంటే... కమలనాథ్ తన ప్రభుత్వాన్ని కాపాడుకునే పనిలో బిజీగా ఉండటం వల్ల, కరోనాపై పెద్గగా ఫోకస్ పెట్టలేదు. తమ ఎమ్మెల్యేలు హ్యాండ్ ఇస్తున్న నేపథ్యంలో కమలనాథ్ ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉన్నారు. అందుకే మార్చి 23 వరకు సీఎం పీఠంలో ఉన్నా, కరోనా వ్యాప్తి అరికట్టడంపై దృష్టి పెట్టలేదు. మొత్తానికైతే ఈ సీఎం, మాజీ సీఎంల లాజికల్ రాజకీయం బాగానే చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: