ఏపీలో కరోనా పై రాజకీయాలు బాగా జరుగుతున్నాయి. ఓ వైపు కరోనాపై ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలు పోరాడుతూనే ఉన్నాయి. అలాగే లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలని అటు ప్రభుత్వం, ఇటు పార్టీలు ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఈ కార్యక్రమంతో పాటు రాజకీయాలు కూడా బాగానే చేస్తున్నారు. ముఖ్యంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య గత కొన్ని రోజులుగా కరోనా మీద రాజకీయం నడుస్తోంది.

 

ఈ క్రమంలోనే ప్రతిపక్ష టీడీపీ చేసే విమర్శలకు కౌంటర్ ఇవ్వడంలో భాగంగా విజయవాడ వైసీపీ తూర్పు ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ చేసిన వ్యాఖ్యలు కాస్త ఆసక్తికరంగా, కాస్త లాజిక్ లేకుండా ఉన్నాయి. మొన్నటివరకు అవినాష్ టీడీపీలో ఉండొచ్చిన విషయం తెల్సిందే. తెలుగు యువత అధ్యక్షుడుగా మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న అవినాష్, తూర్పు సీటు కోసమని చెప్పి వైసీపీలోకి వచ్చారు.

 

అయితే వైసీపీలోకి వచ్చిన దగ్గర నుంచి అవినాష్  మీడియా సమావేశం పెట్టినప్పుడు, చంద్రబాబు  పేరుని పెద్దగా వాడకుండానే తమ అధినేత, సీఎం జగన్ ని పొగుతూనే, టీడీపీ పార్టీపై విమర్శలు చేసేవారు. అంటే టీడీపీ పేరు వాడేవారు తప్ప, చంద్రబాబు పేరు పెద్దగా మాట్లాడేవారు కాదు. ఇక తాజాగా కరోనాపై టీడీపీ, జగన్ పై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో అవినాష్ మీడియా ముందుకొచ్చి టీడీపీ చిల్లర రాజకీయాలు చేస్తుందని అన్నారు. ఇక చంద్రబాబు పేరుని ఒక్కసారి వాడుతూ, ఆయన ఈ టైంలో సీఎంగా ఉంటే టెలీ కాన్ఫరెన్స్ లతో టైం వేస్ట్ చేసేవారని విమర్శించారు.

 

అయితే మళ్ళీ బాబు వారు వాడకపోయిన,  విపత్తు నేపథ్యం గురించి చెబుతూ...  తిత్లీ,హుదూద్ తుఫాన్ల గురించి మాట్లాడారు. ఆ టైంలో టీడీపీ ప్రభుత్వం, సరిగా పనిచేయలేదని కేవలం ఫోటోలు, వీడియోలు తీసుకుని ప్రచారం చేసారని అన్నారు. ఇక ఈ విమర్సే అసలు అర్ధం లేకుండా ఉంది. ఆ తుఫాన్ల సమయంలో చంద్రబాబు ఏ విధంగా పనిచేసారో, ఉత్తరాంధ్ర ప్రజలకు బాగా తెలుసు. ఆయన పని చేశారు కాబట్టే ఉత్తరాంధ్ర ప్రాంతం త్వరగా కోలుకొగలిగిందని ఆ ప్రాంతం వారే మొహమాటం లేకుండా చెబుతారు. అలాంటిది అవినాష్ అలా ఎలా లాజిక్ లేకుండా మాట్లాడారో తెలియడం లేదని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: