కరోనా వైరస్ దెబ్బకి ప్రపంచం షేప్ మొత్తం మారిపోయింది. ఇదే సమయంలో మనిషి ఆలోచనలు కూడా మారిపోతున్నాయి. మొన్నటి వరకు చాలామంది చదువుకున్న యువకులు విదేశాలకు వెళ్లాలని తెగ ప్రయత్నాలు చేసే వాళ్ళు. అయితే కరోనా వైరస్ దెబ్బకు అటువంటి ఆలోచనలు ఇప్పుడు ఏమి చేయటం లేదని అంటున్నారు. యూరప్ మరియు అమెరికా వంటి దేశాలలో పరిస్థితి మొత్తం మారిపోవడంతో పాటు అక్కడి ప్రభుత్వాలు ఇతర దేశస్తులు బయటికి వెళ్లిపోవాలని ప్రస్తుతం డిమాండ్ చేస్తున్నాయి.

 

అంతేకాకుండా నిరుద్యోగం కూడా ఆ దేశాలలో ఏర్పడటంతో అక్కడి ప్రభుత్వాలు ప్రస్తుతం చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఒకానొక టైములో పిల్లల చదువులు గురించి కుటుంబ సభ్యులు ఎక్కువగా విదేశాలకు పంపించాలని మన దేశంలో ఉన్న తల్లిదండ్రులు ఆరాటపడే వాళ్ళు. అయితే ఇప్పుడు మాత్రం పిల్లలకు ఇక్కడ చదువులు చాలు విదేశం వద్దే వద్దు అని అంటున్నారట. 

 

అంతేకాకుండా పిల్లల వివాహ విషయంలో కూడా విదేశాలలో ఉద్యోగాలు చేసే వారికి ఇక ఇచ్చే ప్రసక్తి లేదని ఆడపిల్లల తల్లిదండ్రులు ఓ నిర్ణయానికి వచ్చేశారట. కళ్ళముందు తృప్తిగా కష్టపడి బ్రతికే వారికి పిల్లలని ఇస్తే సరిపోతుంది డబ్బుకోసం..పేరు కోసం విదేశాల్లో ఉన్న వాళ్లకి ఇస్తే ప్రాణాల మీదకి వచ్చే పరిస్థితి కరోనా వైరస్ వల్ల తెలిసి వచ్చింది అంటున్నారట. ముఖ్యంగా కరోనా వైరస్ రావటంతో గ్రామాల నుండి విదేశాలకు వెళ్లి తిరిగి స్వదేశానికి వచ్చిన టైంలో తీవ్రంగా గ్రామస్తుల నుండి వ్యతిరేకత ఎదురు కొనడం..చాలాచోట్ల జరిగింది. మొత్తంమీద చూసుకుంటే కరోనా వైరస్ దెబ్బతో చాలావరకూ విదేశాలకు పంపించ కూడదని తల్లిదండ్రులతో పాటు, చదువుకునే యువకులు కూడా వెళ్ళ కూడదని డిసైడ్ అవుతున్నారట.  



క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: