ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా  వైరస్ ప్రభావం ఎక్కువగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. మొదట్లో తక్కువగా నమోదైన కరోనా కేసులు  ప్రస్తుతం భారీ మొత్తంలో నమోదవుతున్నాయి. ముఖ్యంగా గుంటూరు కర్నూలు జిల్లాలో అయితే కరోనా  వైరస్ విలయతాండవం చేస్తుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ప్రాణభయంతో బతుకుతున్నారు. అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కరోనా ను  కట్టడి చేసేందుకు ఎన్నో కఠిన నిబంధనలు అమలులోకి తెస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ రోజు రోజులు  కరోనా వైరస్ ప్రభావం మాత్రం పెరిగిపోతోంది. 

 


 అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిస్థితులు పరిస్థితి చేయి దాటి పోయే లా కనిపిస్తుంది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాండమిక్ స్టేజ్ కొనసాగుతున్నదా.. అపడమిక్ స్టేజ్  కొనసాగుతున్నదా  అంటే అపడమిక్ స్టేజ్  కొనసాగుతుంది అని చెప్పాలి. అంటే ఎవరి ద్వారా ఎవరికీ కరోనా  వైరస్ సోకింది అనే విషయాన్ని స్పష్టంగా చెప్పవచ్చు . కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను చూస్తుంటే మాత్రం... ఎవరి నుంచి ఎవరికీ కరోనా వైరస్ సోకింది అనే విషయాన్ని స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. కారణం క్రమక్రమంగా పెరుగుతున్న కరోనా  వైరస్ కేసులను ఎలా నమోదు అయ్యాయి అనే విషయం అంతు చిక్కక పోవటం . 

 

 ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరింత దారుణం పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు. కనీసం కరోనా వైరస్ బారిన పడుతున్న వారు ఎవరి కారణంగా కరోనా  సోకింది అనే విషయం కూడా తేల్చలేకపోతున్నరు అధికారులు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆపాయం  రాబోతుంది అంటున్నారు. ప్రస్తుతం లాక్డౌన్  ఎత్తివేయక పోవడానికి కూడా కారణం అదే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒకవేళ ఇలాంటి సమయంలో లాక్ డౌన్  ఎత్తివేస్తే పరిస్థితి పూర్తిగా చేయి దాటి పోతుంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: