కాలమే మనుషులందరికీ పాఠాలు నేర్పిస్తుంది అనేది ప్రస్తుతం కరోనా వైరస్ ఎఫెక్ట్ వల్ల  జరుగుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్   అందరికీ ప్రాణ భయం కలిగిస్తోంది. ఏం చేయాలన్న ఎటు వెళ్లాలి అన్న.. చివరికి పక్కన నిలబడి మాట్లాడాలి అన్న కరోనా  వైరస్ సోకుతుంది అనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రస్తుతం కరోనా వైరస్  ఎఫెక్ట్ ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం దేశ ప్రజలందరికీ ప్రభుత్వ ఆసుపత్రుల విలువ తెలుస్తుంది. ఒకప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం శుద్ధ దండగ అని.. ప్రైవేటు ఆసుపత్రులకు వెళితే.. ఈ టెస్టులు ఆ టెస్టులు అంటూ ఎన్నో టెస్టులు చేసి బిల్లు మోపడంత చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేసేవారు. కానీ ఇప్పుడు మాత్రం దేశ ప్రజలందరికీ ప్రభుత్వ ఆసుపత్రిలో అందరికీ దిక్కయ్యాయి. 

 

 ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు అందరూ తమ ప్రాణాలకు తెగించి మరీ దేశవ్యాప్తంగా ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ఒకప్పుడు ప్రభుత్వాసుపత్రిని ఆసుపత్రి వైద్యులను  తిట్టుకున్నా చాలామంది ప్రజలు ఇప్పుడు ప్రభుత్వాస్పత్రిలో వైద్యుల వద్దకు వెళ్లి చికిత్స చేయించుకుంటున్నారు. కార్పొరేట్ ఆస్పత్రులో  కరోనా  లాంటి ముప్పు పరిస్థితులను వదిలేసి కేవలం డబ్బులు సంపాదించడం పైన దృష్టి పెడుతున్నారు . మనుషుల ప్రాణాలు పైన బిజినెస్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం కరోనా  కష్టకాలంలో రైతే రాజు గా మారిపోయాడు. ప్రస్తుతం కరోనా  వైరస్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా రైతులు పండించిన పంట అందరికీ జీవనాధారంగా మారిపోయింది. 

 

 ఒకవేళ రైతులు మాకెందుకులే అని సైలెంట్ గా  ఉండి ఉంటే వచ్చే తొమ్మిది నెలల వరకు దేశవ్యాప్తంగా ప్రజలు అందరూ పస్తులు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ప్రస్తుతం రైతులు పడిన కష్టం కారణంగా వచ్చే తొమ్మిది నెలల వరకు ప్రజలందరికీ ఆహారం సమకూర్చుకునే విధంగా నిత్యవసర వస్తువులు 9 నెలలకు నిల్వ ఉన్నాయి. ప్రస్తుతం కోతలకు  ఉన్న ధాన్యాన్ని కూడా మరో మూడు నెలల పాటు నిల్వ ఉండే అవకాశం ఉంది. అందుకే ప్రస్తుతం ప్రభుత్వ వైద్య రంగంతో పాటు.. వ్యవసాయ రంగం కూడా ప్రజలందరూ గుర్తుంచుకోవాల్సిన రంగాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: