కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎలా వణికిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఈ కరోనా భారిన పడి ఇప్పటికే ఎన్నో వేలమంది ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఈ కరోనా వైరస్ బారిన 19 లక్షలమంది పడ్డారు. అందులో లక్ష 19వేలమంది ఈ కరోనా బారిన పడి మృతి చెందారు. 

 

ఇంకా అలాంటి ఈ కరోనా వైరస్ భారత్ లో నియంత్రించాలి అని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కరోనా దెబ్బతో ప్రజలు అంత శుభ్రత నేర్చుకున్నారు.. ఇంకా ఈ నేపథ్యంలోనే ప్రజలు ఎవరు కూడా అత్యాశ చూపించడం లేదు. ఎక్కడైనా ఒక నోటు పడింది అంటే చాలు వణికిపోతున్నారు. 

 

ఇంకా ఇప్పటికే ఉత్తర్ ప్రదేశ్ లో 500 నోట్లను చూసి బెదిరిపోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన ఘటన మనం చూసే ఉంటాము. అలాంటి ఘటనే ఇప్పుడు మరొకటి జరిగింది. ఏంటి అంటే? బీహార్‌లోని సహస్ర పట్టణంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి ఇళ్ల ముందు కరెన్సీ నోట్లు పెట్టి వాటితో పాటుగా ఓ లెటర్‌ పెడుతున్నాడట. 

 

నేను కరోనాతో వచ్చాను. ఈ నోటును స్వీకరించండి లేదంటే ప్రతి ఒక్కరినీ వేధిస్తాను అంటూ అందులో రాస్తూ ఇళ్ల ముందు పెట్టాడు. అందులో రూ.20, రూ.50, రూ.100 నోట్లను పెడుతూ ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేస్తున్నాడు ఓ ఆగంతకుడు. ఇలా గత 3 4 రోజుల నుండి జరుగుతుంది.. దీంతో పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగి ఘటనపై కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయాన్నీ చూస్తుంటే అర్థం అవుతుంది.. ఎంతమంది సైకోలు ఉన్నారు అనేది.                           

మరింత సమాచారం తెలుసుకోండి: