కరోనా ప్రపంచాన్ని మెల్ల మెల్లగా కబళిస్తోంది..గొంగళిపురుగు ఆకుతో మొదలు పెట్టి చెట్టుని నాశనం చేసినట్టుగా..చైనా తో మొదలైన ఈ మహమ్మారి ప్రపంచం మొత్తం విస్తరించి కరాళ నృత్యం చేస్తోంది. ఇప్పటికీ చైనా పూర్తిస్థాయిలో కోలుకోలేదని..ఈ వైరస్ కొంతమందికి తగ్గినా మళ్ళీ కొన్ని రోజుల తరువాత పాజిటివ్ కేసులుగా మారుతున్నాయని చైనాలో వైద్యులు అంటున్నారు దాంతో అన్ని దేశాలలో కంగారు మొదలయ్యింది. క్వారంటైన్ నుంచీ కొల్కుని వెళ్ళిన తరువాత కూడా కనీసం 10 రోజుల పాటు బయటకి వెళ్ళే సాహసం చేయద్దని అక్కడి రోగులకి హెచ్చరికలు చేస్తున్నారు..ఈ నేపధ్యంలోనే చైనా శాస్త్రవేత్తలు చెప్పిన మరొక విషయం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది...

IHG's severity and symptoms ...

ఈ మహమ్మారి ఇప్పుడు చాలా చోట్ల తగ్గుముఖం పట్టినట్టుగా కనిపించచ్చు కానీ భవిష్యత్తులో దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని తెలిపారు చైనా కి చెందిన శాస్త్రవేత్తలు. అన్ని దేశాలలో కరోనా మరణాలు పెరుగుతున్నాయి కొన్ని చోట్ల తగ్గుతున్నాయి..కానీ ఇదంతా మొదటి దశలో భాగమేనని కరోనాలో రెండవ దశ కూడా ఉందని హెచ్చరిస్తున్నారు..ఈ వైరస్ పీడ కొన్ని రోజుల్లో వదిలిపోతుంది అనుకుంటున్నా దేశాధినేతలకి ఈ వార్త గుండెల్లో గుదిబండని పెట్టినట్టు అయ్యింది...

కరోనా రెండవ దశ గురించి చెప్పిన శాస్త్రవేత్త  జాంగ్ వెన్ హాంగ్ భవిష్యత్త ప్రశాంతంగా ఉంటుందని ఎవరూ అనుకోవద్దు నవంబర్ నుంచీ కరోనా ప్రభావం ఇప్పటికంటే కూడా దారుణమైన పరిస్థితిలో ఉంటుందని అన్నారు. మళ్ళీ నవంబర్ లో ఈ వైరస్ తారా స్థాయికి వెళ్ళడంతో పాటుగా అది సృష్టించే ప్రళయం ఊహించడానికే భయంకరంగా ఉంటుందని హెచ్చరించారు..శీతాకాలం వస్తే ఈ వైరస్ ని కంట్రోల్ చేయడం ఎవరి వల్లా కాదని తెలిపారు. కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా మృతి చెందిన వారి సంఖ్య 1.20 వేలకి చేరుకోగా. కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న వారి సంఖ్య 19 లక్షలకి పైమాటే..

 

మరింత సమాచారం తెలుసుకోండి: