కరోనా వైరస్ ఎంత దారుణంగా.. ఎంత వేగంగా వ్యాపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి కరోనా వైరస్ ను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. దీంతో ప్రజలంతా కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇంకా ఇంటి నుండి బయటకు వచ్చిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కొందరిపై కేసులు నమోదు చేస్తుంటే మరికొందరికి ఫైన్లు వేస్తున్నారు. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే ఆంధ్రాలో కూడా లాక్‌డౌన్ కొనసాగుతుంది. అధికారులు, పోలీసులు పక్కాగా నిబంధనల్ని అమలు చేస్తున్నారు. ప్రజలు ఎవరు బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. ఒకవేళ బయటకు వచ్చిన మాస్క్ ధరించి సామజిక దూరంగా పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచిస్తున్నారు.. ఇంకా అనవసరంగా రోడ్డుపైకి వచ్చి షో చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. 

 

ఇంకా అక్కడక్కడా వాహనాలను సీజ్ చేస్తున్నారు కూడా. ఇది ఇలా కొనసాగుతుండగా కొందరు ప్రజా ప్రతినిధులు, రాజకీయ నేతలు కూడా లాక్‌డౌన్ పాటించకుండా ఉన్నవారిపై పోలీస్ కేసులు నమోదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కర్నూలు జిల్లా నందికొట్కూరు వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామిపై నందికొట్కూరు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు. 

 

ఆదివారం హైపో ద్రావణం పిచికారీ చేసేందుకు వచ్చిన వారు లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించారని, భౌతిక దూరం పాటించలేదని వారిపై వారి అనుచరులు కొంత మందిపై కేసు నమోదు చేశారు. ప్రతి ఒక్కరూ లాక్‌డౌన్ నిబంధనలు పాటించాల్సిందేనని పోలీసులు చెప్పుకొచ్చారు.. అంతేగా మరి.. బ్రిటన్ లో ప్రధానికే కరోనా వచ్చింది.. మనకు రాదా? ఏంటి? అందుకే లాక్ డౌన్ లో ఎవరు బయటకు రాకుండా ఇంట్లోనే ఉంది ఆరోగ్యంగా ఉండండి.                 

మరింత సమాచారం తెలుసుకోండి: