ప్రపంచంలో ఏ దుర్మూహూర్తంలో కరోనా వైరస్ మొదలైందో కాని.. మానవాళి మనుగడనే ఓ ప్రశ్నార్థకంగా మారింది.  చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన ఈ మాయదారి మహమ్మారి ఇప్పుడు అగ్ర రాజ్యాలకు వెన్నుల్లో వణుకు పుట్టేలా చేస్తుంది.  ఇక భారత దేశంలో ఈ కరోనా రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉంది. ఇప్పటికే వ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య 9,405కు చేరింది. ‘కరోనా’ బారిన పడి ఇప్పటి వరకు 335 మంది మృతి చెందగా, దీని నుంచి 1,109  మందికి పైగా కోలుకున్నారు. ‘కరోనా’ హాట్ స్పాట్ మహారాష్ట్రలో ఇప్పటి వరకు 2,604, ఢిల్లీలో1,154 కేసులు, తమిళనాడులో 1,075, రాజస్థాన్ లో 847, మధ్యప్రదేశ్ లో 562, తెలంగాణలో 531, ఏపీలో 432 కేసులు నమోదయ్యాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ బలితీసుకుంటుంది.

 

తాజాగా తెలంగాణలోని ఏడేళ్ల బాలుడు కరోనా మహమ్మారి బారినపడ్డాడు. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌కు చెందిన వ్యక్తి (36) గత నెల 17న స్విట్జర్లాండ్ నుంచి తిరిగొచ్చాడు.  ఆ తర్వాత నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగటివ్ అని తేలడంతో ఇంటికెళ్లాడు. అయితే,  ఈ నెల 5, 6 తేదీల్లో అతడి ఏడేళ్ల కుమారుడు జ్వరం, దగ్గుతో బాధపడుతుండడంతో అనుమానించి పరీక్షలు చేయించగా ఈ నెల 12న కరోనా పాజిటివ్ అని తేలింది. 

 

అయితే వీరింతా ఇప్పుడు . ప్రస్తుతం వారంతా పటాన్‌చెరులోని ఐసోలేషన్ కేంద్రంలో ఉన్నట్టు అధికారులు తెలిపారు.   ఈ మాయదారి మహమ్మారి వల్ల ప్రజలు మనశ్శాంతిగా ఉండటం లేదని.. ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటికే పరిమితం అవుతున్నారు జనాలు. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple


 

మరింత సమాచారం తెలుసుకోండి: