భారత రాజ్యాంగ సృష్టికర్త అంబేద్కర్ జయంతి నేడు. ప్రతి విజయం వెనుక ఒక ఆడది ఉంటారు అంటారు కదా. అలాగే అంబేద్కర్ జీవితంలో కూడా అతని భార్య రమాబాయి అంబేద్కర్ సహకారం కూడా ఎంతో ఉంది. రమాబాయి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. రమాబాయి 1897 మే 7న వాళ్లను గ్రామంలో వాలంగ్ దగ్గర జన్మించారు. రమాబాయి ది చాలా పేద కుటుంబం వారి తండ్రి కూలి పని చేసేవారు. వారు బుట్టలో చేపలు పట్టుకుని సముద్ర తీరంలో ఓ బార్లో వాటిని అమ్ముకునేవారు. వాటి సంపాదన కూడా అంతగా సరిపోయేది కాదు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన ఆమె కొంత కాలానికి తండ్రి కూడా మరణించాడు. ఆ తర్వాత వారు బొంబాయి లో ఉండే మేనమామ దగ్గరికి చేరుకున్నారు.

 

 

ఇక ఆమె వివాహం విషయానికి వస్తే కేవలం రమాబాయి కి తొమ్మిది ఏళ్ళ వయసులోనే అప్పటికి పదో తరగతి పూర్తి చేసిన 15 సంవత్సరాల అంబేద్కర్ తో పెళ్లి జరిగింది. వారి వివాహం జరిగిన విధానం చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ముంబైలోని బైకుల్లా చేపల మార్కెట్ లో ఓపెన్ షెడ్ లో జరిగింది. రమాబాయి చాలా తెలివిగా, బాధ్యతగా వహించేవారు వారు పేదరికంలో ఉన్నప్పటికీ ఎప్పుడు ప్రశాంత జీవనం సాగించేవారు ఆమె.

 


నిజానికి వివాహ సమయానికి రమాబాయికి ఎటువంటి చదువు రాదు. వారి వివాహం తర్వాత అంబేద్కర్ స్వయంగా ఆవిడకు ఓనమాలు దిద్దించి చదువు చెప్పారు. ఆవిడకి అంబేద్కర్ అంటే అమితమైన ప్రేమ అలాగే అనురాగంతో కూడిన గౌరవం ఉండేది. నమ్మకం, త్యాగం అర్థం చేసుకునే గుణం వీరిద్దరినీ జీవితాంతం ఆనందంగా ఉండేటట్లు సాగించింది జీవితం. రమాబాయి అంబేద్కర్ ని ప్రేమగా రాము అని పిలిచేవారు. అలాగే అంబేద్కర్, రమాబాయి ని సాహెబ్ అని పిలిచేవారు. నిరంతరం ఏదో అధ్యయనంతో నిమగ్నమైన తన భర్తను చూసి ఆమె చాలా గర్వపడే వారు. ఆయన విజయం కోసం ఆమె నిత్యం తపించేవారు.

మరింత సమాచారం తెలుసుకోండి: