తెలుగు చిత్ర పరిశ్రమలో నాచురల్ స్టార్ గా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు నాని. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ  ఇచ్చి ప్రస్తుతం స్టార్ హీరో గా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం సీనియర్ హీరోల వారసులు చిత్రపరిశ్రమకు ఎంతో మంది ఎంట్రీ ఉన్నప్పటికీ... ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి  తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించారు. ఎలాంటి పాత్రలో అయిన  ఒదిగిపోయి నటిస్తూ పక్కింటి కుర్రాడు లా అనిపించే నాని ఇప్పటివరకు ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. నవీన్ బాబు ఘంటా గా ఉన్న తన పేరును స్క్రీన్ నేమ్ నాని గా మార్చుకున్నారు. ఇక సినిమాల మీద ఆసక్తితో దర్శకుడిగా  అవుదామని చిత్ర పరిశ్రమకు వచ్చి శ్రీను వైట్ల బాపు లాంటి దర్శకులు సహాయ దర్శకుడిగా పని చేశారు. ఆ తర్వాత హైదరాబాద్లో కొన్ని రోజులపాటు రేడియో జాకీగా పని చేసాడు. 

 

 

 అప్పటికే సినిమాల మీద మక్కువతో నాని సినిమాలో అవకాశం కోసం స్టూడియోల చుట్టూ తిరుగుతూ ఉండేవాడు. ఈ క్రమంలోనే ఓ వాణిజ్య ప్రకటన నాని లైఫ్ నే మార్చేసింది. వాణిజ్య ప్రకటన తర్వాత ఓ  దర్శకుడు కళ్ళలో పడిందని అష్టా చమ్మా అనే సినిమాలో హీరో గా అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఈ సినిమాలో  కలర్స్ స్వాతి తో కలిసి నటించాడు నాని. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న నాని ఆ తర్వాత ఎన్నో అవకాశాలను దక్కించుకుంటారు. ఇక నాని నటించిన భీమిలి కబడ్డీ జట్టు, పిల్ల జమిందార్ లాంటి సినిమాలు నాని లోని నటుణ్ని ప్రేక్షకులందరికీ పరిచయం చేసాయి. ఇక ఆ తర్వాత ఏకంగా దర్శకధీరుడు రాజమౌళి సినిమాలో ఛాన్స్ కొట్టేశాడు. 

 

 

 తనదైన నటనతో ప్రతీ పాత్రలో ఒదిగిపోయి నటిస్తూ ప్రేక్షకులకు  నాచురల్ స్టార్ గా మారిపోయిన నాని.. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాలో ఛాన్స్ కొట్టేసి ఈ సినిమాతో  నాని సంచలన విజయాన్ని నమోదు చేశారు. సినిమా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం, మిడిల్ క్లాస్ అబ్బాయి నిన్నుకోరి లాంటి చిత్రాలతో వరుస విజయాలను సొంతం చేసుకున్నారు. 

 

 

 ఆ తర్వాత నిర్మాతగా కూడా అవతారమెత్తాడు నాని . డి ఫర్ దోపిడి.. ఆ... అనే చిత్రాన్ని కూడా నిర్మించి నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యాడు. మా టీవీలో ప్రసారమైన  రియాలిటీ షో బిగ్ బాస్ కి వ్యాఖ్యాతగా వ్యవహరించి  మందిని ఆకట్టుకున్నాడు . ఇలా నాని కెరీర్ మొత్తం విజయవంతంగా దూసుకుపోయింది. ప్రస్తుతం ఎంతో సినీ  బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవటానికి కష్టపడుతున్న వారు చాలామందే.కానీ  ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి హీరోగా నిర్మాతగా వ్యాఖ్యాతగా నిలదొక్కుకుని ప్రస్తుతం ఎంతో మంది ప్రేక్షకుల ఆదరాభిమానాలు సంపాదించుకున్న నానీ హెరాల్డ్ విజేతగా నిలిచాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: