ప్రపంచ దేశాలన్నీ ప్రస్తుతం లాక్ డౌన్ లో ఉన్నాయన్న సంగతి తెలిసిందే. భారతదేశం లో కూడా 10వేల పైచిలుకు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అందుకే తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ ఇంకో 20 రోజుల పాటు అనగా మే 3వ తేదీ వరకు పొడగిస్తునట్టు తెలిపారు. అయితే ఈ ఖాళీ సమయాన్ని మీరు మీ అలవాట్లతో హాయిగా గడపవచ్చు.


చాలా మందికి ఏదో ఒక అలవాటు తప్పకుండా ఉంటుంది. చదవడం, బొమ్మలు గీయడం, పాటలు పాడటం, డాన్స్ వేయడం, పరిగెత్తడం, మెడిటేషన్ చేయడం, యోగా చేయడం సైకిల్ తొక్కడం లాంటి అలవాట్లు ఉంటాయి.


ఒకవేళ మీకు చదివే అలవాటు ఉంటే... ఆండ్రాయిడ్, ఆపిల్ స్టోర్స్ నుండి మీకు ఇష్టమైన నవలను, చరిత్ర పుస్తకాలను, నాలెడ్జి పెంచే బుక్స్ డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. బొమ్మలు గీసే అలవాటు ఉన్న వారు స్కెచ్ పెన్, కాగితం పట్టుకుని మంచి చిత్రాలను గీస్తూ సమయాన్ని గడిపేయవచ్చు. లాప్ టాప్, ఆండ్రాయిడ్ ఫోన్లలో కూడా డ్రాయింగ్ వేసుకున్నందుకు యాప్స్ దొరుకుతాయి.


పాటలు పాడే అలవాటు ఉన్నవారు 'Smule' అనే ఆండ్రాయిడ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు మంచిగా పాడిన పాటని ఆ యాప్ లో అప్లోడ్ చేస్తే... మీ పాట దేశంలోని అందరికీ చేరుతుంది. అలాగే మీరు ఎంత బాగా పాట పాడారో ఈ సోషల్ సింగింగ్ యాప్ లోని శ్రోతల అభిప్రాయాల నుండి తెలుసుకోవచ్చు. నాట్యం చేసే అలవాటు ఉన్నవారు మంచి పాటలు పెట్టుకుని డాన్స్ వేసి ఫిట్ నెస్ తో పాటు మానసిక ఉత్సాహాన్ని పెంచుకోవచ్చు. అలాగే డాన్స్ కు సంబంధించిన వీడియోని యూట్యూబ్ లో షేర్ చేసుకుని పాపులర్ అవ్వొచ్చు.


వ్యాయామంలో అత్యుత్తమైన 'పరిగెత్తడం' అనేది చాలా మంచి అలవాటు. ఈ అలవాటు ఉన్నవారు ఉదయం పూట, సాయంత్రం వేళ ఎక్కువ దూరం వెళ్ళకుండా మీ పరిసర ప్రాంతాలలో ఎంచక్కా పరిగెత్తి ఫిట్నెస్ పెంచుకోవచ్చు. మెడిటేషన్ అలవాటు ఉన్నవారు... మీ రోజులో ప్రశాంతమైన సమయాన్ని మూడు భాగాలుగా విభజించుకొని ఆ సమయాలలో 20 రోజులపాటు ప్రతిరోజూ ధ్యానం చేసి అద్భుతమైన ప్రయోజనాలను పొందండి.


యోగ అలవాటు ఉన్నవారు సరికొత్త యోగాసనాల గురించి అవగాహన పెంచుకోండి. అలాగే ప్రతిరోజు ఉదయం సాయంత్రం శీర్షసనా, సర్వాంగాసన 30 నిమిషాలపాటు వేయడానికి ప్రయత్నించండి. సినిమాలు చూసే అలవాటు ఉన్నవారు... ఇతర భాషలో హిట్ అయిన చిత్రాలను వీక్షించండి. ఏది ఏమైనా కరోనా వైరస్ వచ్చిన కారణంగా మనం ఎదుర్కొంటున్న పరిస్థితిలలో ఎంతో కొంత పాసిటివిటీ ని వెతుక్కొని వ్యక్తిగతంగా ఎదగడానికి ప్రయత్నించండి.




మరింత సమాచారం తెలుసుకోండి: