దేశంలో కరోనా వ్యాప్తి రోజు రోజుకీ పెరిగిపోతుంది.  ఈ నేపథ్యంలో మొన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్పిరెన్స్ నిర్వహించారు.  ఈసందర్భంగా లాక్ డౌన్ పొడిగిస్తేనే మంచిదని.. కరోనా నిర్మూలన పూర్తి స్థాయిలో చేయగలం అని లేదంటే మళ్లీ మొదటికే వస్తుందని అభిప్రాయ పడ్డారు.  ఈ నేపథ్యంలో జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగించారు.  ప్రజలకు ఇప్పుడు కష్టాల్లో ఉన్నారని.. అయితే ఆరోగ్యం కన్నా ఇది పెద్ద కష్టం కాదని.. అందరం ఆరోగ్యంగా ఉంటే ఎలాగైని కష్టపడి బతకవొచ్చు.. ఇప్పుడు కరోనా తీవ్ర స్థాయిలో ఉందని ఈ సందర్భంగా లాక్ డౌన్ మే 3 వరకు పొడిగిస్తున్నాట్లు తెలిపారు. 

 

లాక్‌డౌన్‌ నిబంధనలకు అనుగుణంగా రాష్ట్రాలు మరిన్ని చర్యలు తీసుకుంటున్నాయి. ఏప్రిల్‌ 20 నుంచి అత్యవసర విషయాలకు కొన్ని ప్రత్యేక అనుమతులు ఉంటాయని ప్రధాని మోదీ ప్రకటించారు.  ఇందులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా అనుమతులు వెనక్కి తీసుకోవడం జరుగుతుందని అన్నారు.  తాజాగా ఈ విషయం పై స్పందించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఈ నెల 20 నుంచి కొన్నింటికి షరతులతో కూడిన అనుమతులు ఉంటాయని వివరించారు.

 

ఈ నెల 20 వరకు అన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాల్సిందేనని తెలిపారు. దేశ వ్యాప్తంగా 46 జిల్లాల్లో ఇంతవరకూ ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదన్నారు.   వైరస్‌ కట్టడికి చర్యలు తీసుకుంటే దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దవచ్చని తెలిపారు. కరోనా నుంచి కోలుకున్న వారు  ఇళ్లల్లో సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉండాలని ఆయన చెప్పారు.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: