చంద్రబాబు అంటేనే రాజకీయం. అలాంటి ఇలాంటి రాజకీయం కాదు, ఆయన ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ. ఆయన పేరుకు ముందు ఎన్నో  ట్యాగులు ఉంటాయి. మూడు సార్లు ముఖ్యమంత్రి, ముమ్మారు విపక్ష నేత. ఉమ్మడి ఏపీలో అత్యధిక కాలం పనిచేసిన సీఎంగా రికార్డు, ప్రధానులను, రాష్ట్రపతులను ఎంపిక చేసిన జాతీయ స్థాయి నాయకుడు.

 

అటువంటి బాబు ఇపుడు ఏపీకి ఎటూ  కాకుండా అయిపోయారు. కరోనా దెబ్బకు లాక్ డౌన్ విధిస్తే బాబు హైదరాబాద్ లో ప్రవాస జీవితం గడుపుతున్నారు. తాను ఎంతగానో వలచిన అమరావతి రాజధానికి  దూరంగా నలభై రోజులు. బాబోయ్ తలచుకుంటేనే ఎంత భారం.అయినా తప్పదు బాబు మే 3వ తేదీ వరకూ ఇంట్లో ఉండాల్సిందే.

 

అన్నింటికీ మించి తెలంగాణాలో కేసీయార్ ముఖ్యమంత్రిత్వంలో బాబు ఒక సాధారణ పౌరుడిగా జీవితాన్ని వెళ్ళదీయడం. ఒకనాడు ఉమ్మడి ఏపీని ఒంటి చేత్తో పాలించిన బాబుకు ఇపుడు తెలంగాణాలో రాజకీయంగా పెద్దగా పని లేదు. అక్కడ ఆయన గారి పార్టీ కూడా మూడంకె  వేసింది.

 

ఇపుడు బాబు హైదరాబాద్ లో ఉన్న ఎందరోమాజీల సరసన, అలాగే  రాజకీయ వీఐపీల మాదిరిగానే ఉండాలి. టీవీలలో వచ్చే న్యూస్ చూసుకుంటూ టైం పాస్ చేయాల్సిందే. మోడీ మరో 19 రోజులు లాక్ డౌన్ అనేసరికి బాబు గారికి బిగ్ షాక్ తగిలినట్లుందేమో. 

 

తాను ఎక్కడికీ కదలకా మెదలకా ఇంట్లో కూర్చోవడం అంటే బాబు  గారి రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడని అనుభవమే. కానీ ఏం చేస్తాం. తప్పదు. లాక్ డౌన్ వల్ల బాబు ప్రవాస ఆంధ్రుడిగా, పొరుగు రాష్ట్రం నేతగా ఉండాల్సిందే.

 

చేతిలో పెన్నూ కాగితం ఉంటే రోజుకో లెటర్ జగన్ కి రాసుకోవాల్సిందే. అదీ కాదూ కూడదు అనుకుంటే పార్టీ నేతలతో వీడియో సమవేశాలు పెట్టి ముచ్చట్లు పెట్టుకోవాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: