తెలంగాణలో విద్యాసంస్థలు జూన్ వరకు ఇక తెరిచే పరిస్థితి కనిపించడం లేదు. ఒకటో నుంచి 9వ తరగతుల వరకు విద్యార్థులను ప్రభుత్వమే ప్రమోట్ చేసింది. ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాయి... పదో తరగతి పరీక్షలు పెండింగ్ లో ఉన్నాయి... డిగ్రీ ,పీజీ తరగతుల పరీక్షలు కూడా జూన్ వరకు కష్టమేననే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 

 

కరోనా మహమ్మారి అన్ని రంగాలతో పాటు విద్యా వ్యవస్థను అతలాకుతలం చేసింది. విద్యా సంవత్సరం చివరలో, పరీక్షల సమయంలో ఈ వైరస్ విజృంభించడంతో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పాఠశాల విద్యార్థులను కేంద్రంతో పాటు, చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రమోట్ చేశాయి. ఒకటి  నుంచి 9వ తరగతి విద్యార్థులను తరవాతి క్లాస్ లకు ప్రమోట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే బాటలో నడిచింది. తెలంగాణ కేబినెట్ దీన్ని ఆమోదించింది. దీంతో పాఠశాలలు ఇప్పట్లో ఓపెన్ చేసే అవకాశం లేదు... జూన్ 12 వరకు క్లోజ్ అయినట్టే.


 
లాక్ డౌన్‌ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 30 వరకు పొడిగించింది. ఈ నెల 23న పాఠశాలలకు చివరి పనిదినం కావడంతో ఇక ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలలు తెరిచే అవకాశం లేదు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొన్నాయి...ఒకటో తరగతి నుండి 8 వ తరగతి వరకు విద్యార్థులను డిటెన్షన్ చేయొద్దని.. 9 వ తరగతి విద్యార్థుల్ని హాజరు శాతాన్ని పట్టి ప్రమోషన్ ఉంటుందని అంటున్నాయి... పదో తరగతి పరీక్షల విషయంలో ప్రభుత్వం ఎదో ఒక నిర్ణయాన్ని వెంటనే ప్రకటించాలని టీచర్స్ యూనియన్ డిమాండ్ చేస్తున్నాయి. విద్యార్థులందరినీ  ఉత్తీర్ణులు చేసినా ఇబ్బంది ఏమీ లేదనీ... ఎలాగూ ఉత్తీర్ణత 85 శాతం కన్నా ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.  

 

ఇంటర్ పరీక్షలు పరీక్షలు ముగిసాయి. ఒక్క జాగ్రఫీ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. ఇది పెద్ద సమస్య కాదు... దీంతో ఇంటర్ తరగతులు కూడా జూన్ వరకు జరిగే అవకాశం లేదు. డిగ్రీ, పీజీకి సంబంధించిన తరగతులు జరిగే అవకాశం లేదు. లాక్ డౌన్ ఎత్తేసినా గుంపులుగా జరిగే కార్యక్రమాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వక పోవచ్చు సో కళాశాలలు, యూనివర్సిటీ లు మే లో కూడా నడిచే అవకాశం లేదు. దీంతో తరగతులు ఆన్ లైన్ లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి ఆయా మేనేజ్ మెంట్ లు. మే లో జరగాల్సిన అన్ని కామన్ ఎంట్రెన్స్ పరీక్షలను వాయిదా వేసింది ఉన్నత విద్యా మండలి. ఆ పరీక్షలు కూడా జూన్ లో జరగొచ్చు. పరిస్థితులు చూస్తుంటే ఇక జూన్ వరకు ఎలాంటి విద్యా పరమైన ఆక్టివిటీస్ జరిగే అవకాశం లేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: