దేశంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ప్రతిరోజూ వందల సంఖ్యలో కేసులు నమోదవుతూ ఉండటంతో కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా పంజా విసురుతున్న నేపథ్యంలో శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. చైనా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో పొగ తాగేవారికి కరోనా సోకేందుకు 14 రెట్లు ఎక్కువ అవకాశం ఉందని తేలింది. 
 
ఇప్పటివరకు కరోనా సోకినవారు ఎక్కువగా పొగ తాగే వారే కావడం గమనార్హం. పొగ తాగేవారిలో రోగ నిరోధక శక్తి తగ్గడంతో కరోనా సులభంగా వ్యాపిస్తుందని తేలింది. వైద్యులు ఎవరికైనా పొగ తాగే అలవాటు ఉంటే వెంటనే మానుకోవాలని సూచించారు. పొగ తాగేవారికి శ్వాసకోశ సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.  ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా పొగ తాగే వారు కరోనా భారీన పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. 
 
పొగ తాగే సమయంలో ముక్కు ఎస్ 2 అనే ఎంజైమ్ ను ఎక్కువగా స్రవిస్తుందని... ఈ ఎంజైమ్ వల్ల కరోనా వైరస్ నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడే వారు ఈ వైరస్ భారీన ఎక్కువగా పడే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరోవైపు దేశంలో ప్రతిరోజూ వందల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. 
 
ఏపీలో ఈరోజు 34 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్రంలో నిన్న సాయంత్రం 5 నుంచి ఈరోజు ఉదయం 9 వరకు జరిగిన కరోనా పరీక్షల్లో గుంటూరులో 16, కృష్ణా జిల్లాలో 8, కర్నూలులో 7, అనంతపూర్ లో 2, నెల్లూరు లో ఒక కేసు నమోదయ్యాయని ప్రకటన చేసింది. కొత్తగా నమోదైన 34 కేసుల తో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 473 కి పెరిగింది. తెలంగాణలో నిన్న ఒక్కరోజే 61 కరోనా కేసులు నమోదు కాగా రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 592కు చేరింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: