నారాయణ విద్యాసంస్థల అధిపతి గా పేరొందిన నారాయణ 2014 ఎన్నికల టైంలో టీడీపీ గెలిచిన తర్వాత పార్టీ తరఫున పదవి పొంది మంత్రి అయ్యారు. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు మరియు నారా లోకేష్ తర్వాత తానే అన్నట్టుగా వ్యవహరించేవారు. రాజధాని అమరావతి విషయంలో గానీ ఇంకా తెలుగుదేశం పార్టీ తీసుకున్న అనేక కీలకమైన విషయాల్లో గాని నారాయణ కనుసన్నల్లోనే పనులు జరిగేవని అప్పట్లో టిడిపి పార్టీలో వార్తలు వచ్చేవి. నెల్లూరు జిల్లా నుండి ప్రాతినిధ్యం వహించిన నారాయణ...నెల్లూరు జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలపై అప్పట్లో దృష్టి పెట్టారు. అయినా గాని గత సార్వత్రిక ఎన్నికలలో ఓటమి పాలయ్యారు. దీంతో అప్పటి నుండి రాజకీయాలకు దూరమయ్యారు. జిల్లాలో జరిగే పార్టీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా నారాయణ కనిపించడం లేదు.

 

ఎక్కువగా నారాయణ హైదరాబాద్ లోనే ఉంటున్నట్లు సమాచారం. ఇక్కడ పూర్తి మేటర్ లోకి వెళితే ప్రస్తుతం కరోనా వైరస్ నెల్లూరు జిల్లాలో తీవ్ర స్థాయిలో విజృంభించి ఉంది. పాజిటివ్ కేసులు చాలా బలంగా నమోదవుతున్నాయి. దీంతో నెల్లూరు జిల్లా నుంచే విద్యా సంస్థల అధిపతి గా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింపజేసిన నారాయణ ఇటువంటి విపత్తు విషయంలో కనబడకపోవడం పై అనేక విమర్శలు వినబడుతున్నాయి.

 

అత్యంత కీలకమైన టైములో కరోనా వైరస్ కట్టడి చేయడంలో నెల్లూరు జిల్లాలో అధికార పార్టీ వైసీపీ ఫెయిల్ అయిందన్న వార్తలు వస్తున్న టైములో అధికార పార్టీని ప్రశ్నించాల్సిన నారాయణ ప్లానింగ్ ఎవరికి అర్థం కావడం లేదన్న వార్తలు వినబడుతున్నాయి. ప్రస్తుతం నారాయణ గురించి రకరకాల వార్తలు రాజకీయంగా ఊపందుకుంటున్నాయి. కేవలం తనకి లాభం చేకూరుతుంది అంటేనే ప్రజల మధ్య ఉంటారా ?, అంటూ నారాయణ పై నెల్లూరు జిల్లా లో విమర్శలు వినబడుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: