ఒకవైపు తెలుగు రాష్ట్రాల్లో కరోనా చాపకింద నీరులా వ్యాప్తి చెందుతుంది. దీన్ని నివారించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు అహర్నిశలు పనిచేస్తున్నాయని చెప్పొచ్చు. ఈ రాష్ట్రలలో ముఖ్యంగా నమోదైన కేసులు ఢిల్లీలో మత సభలకు వెళ్లి వచ్చిన ముస్లిం వ్యక్తులకు అధికంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇక ఈ విషయాల్లో ఇలా ఉంటే టిడిపి నేత చంద్రబాబుని వైస్సార్సీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పలు వ్యాఖ్యలు చేశాడు.

 


ఇక అసలు విషయానికి వస్తే... తిరుపతిలో జరిగిన ఒక సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ... వైసిపి నాయకులు టార్గెట్ గా టిడిపి అధినేత చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... డిప్యూటీ సీఎం నారాయణ స్వామి క్షమాపణ అడిగిన తర్వాత కూడా భర్తరఫ్ చేయాలని అడగడం మూర్ఖత్వమని అన్నారు. ఒక మతాన్ని కించపరిచేలా ఉన్నారంటూ చంద్రబాబు ఒక పేపర్లో రాయించారని పెద్దిరెడ్డి ఆయన్ని ఘాటుగా విమర్శించారు.

 


అయితే రామచంద్రారెడ్డి మాట్లాడుతూ... చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు మైనార్టీలకు ఏమి చేశారో చెప్పాలని అన్నారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రం గురించి పట్టించుకోవడం లేదని ఆయన హైదరాబాద్ లో ఉంటూ కేవలం స్టేట్మెంట్లు ఇస్తున్నారు అని పెద్దిరెడ్డి గట్టిగా విమర్శించారు. ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంతమంది మైనార్టీలకు పదవులు ఇచ్చాడో సమాధానం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. నిజానికి చంద్రబాబు తీరు వల్ల చిత్తూరు జిల్లా నాయకులనే ప్రజలు నమ్మడం లేదని ఎన్నికలు ఎప్పుడొచ్చినా అక్కడ వైసీపీ గెలుస్తుందని పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు.

 


ఇదిలా ఉండగా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ రోజురోజుకీ ఎక్కువగా వ్యాపిస్తుంది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఐదు వందలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే నేటితో 450 కేసులు నమోదయ్యాయి. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వారి సాయశక్తులా ప్రజలకు సహకారాన్ని అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: