దేశంలో కరోనాని అరికట్టడానికి గత నెల 24 నుంచి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ కరోనా మాత్రం కట్టడి కావడం లేదు.  దేశంలో కరోనా కేసుల సంఖ్య పదివేలకు చేరింది.  నేటీ ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. దేశంలో కరోనా అస్సలు కంట్రోల్ కావడం లేదని.. ఈ విషయాన్ని అన్నిరాష్ట్రాల ముఖ్యమంత్రులు తనతో మాట్లాడారని.. వారు లాక్ డౌన్ పొడిగింపే మంచి నిర్ణయం అని సూచించినట్లు తెలిపారు.  ఈ నేపథ్యంలో మే 3 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు తెలిపారు. 

 

తాజాగా  కరోనాపై భారతావని చేస్తున్న పోరాటంలో లాక్ డౌన్ ను పొడిగించాలన్న ఆలోచన కేవలం ఓ గేమ్ చేంజర్ అని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ వ్యాఖ్యానించారు. కరోనాపై పోరులో ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ఓ ప్రణాళికను సిద్ధం చేశారని, దీనిపై రేపు ఓ కీలక ప్రకటన వెలువడనుందని తెలిపారు.  ఏప్రిల్ 20 తరువాత రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించాల్సిన లాక్ డౌన్ వ్యూహంపైనా కేంద్రం నుంచి సలహాలు, సూచనలు అందుతాయని, ఆపై రాష్ట్రాల్లోని పరిస్థితులకు అనుగుణంగా, ఆయా ప్రాంతాల్లోని సౌలభ్యాల ప్రకారం నిర్ణయాలు తీసుకోవచ్చని జావదేకర్ సూచించారు.

 

దేశ ప్రజలంతా విధిగా అన్ని నిబంధనలూ పాటిస్తే, కరోనాపై యుద్ధంలో తప్పక గెలిచితీరుతామని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మహమ్మారికి విరుగుడును శాస్త్రవేత్తలు త్వరగా కనిపెట్టాలని కోరారు. ప్రధాని నేడు చేసిన ప్రసంగం, ఆయనలోని నాయకుడిని, జాతి ప్రజల పట్ల ఉన్న అంకితభావాన్ని ప్రతిబింబించిందని అన్నారు. ఏప్రిల్‌ 20 వరకు దేశంలో పరిస్థితులను నిశితంగా పరిశీలించి.. తదనుగుణంగా బుధవారం నిబంధనలు జారీ చేస్తామని వెల్లడించారు.

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: