కరోనా వైరస్ వ్యాప్తి దేశవ్యాప్తంగా విజృంభిస్తున్నకారణంగా దానిని అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఒకటే మార్గంగా ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే మూడోసారి నిబంధనలు సడలించి మే మూడో తేదీ వరకు ఈ నిబంధనలను పొడిగించారు. ప్రస్తుతం ఈ వైరస్ వ్యాప్తి అడ్డుకునేందుకు ఇదొక్కటే మార్గంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ కు నివారణ మందు  కనిపెట్టకపోవడంతో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. ప్రపంచదేశాల్లో ఈ వైరస్ ప్రభావం తీవ్రంగా ఉండడంతో అల్లాడుతున్నాయి. ప్రస్తుతం మనదేశంలో పరిస్థితి కాస్త అదుపులోనే ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే ప్రధాని నిర్ణయంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. 


ఇప్పటికే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాని నిర్ణయాన్ని సమర్థిస్తున్నట్లు గా ప్రకటించారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త జనతాదళ్ పార్టీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ విమర్శించారు. ప్రస్తుతం లాక్ డౌన్ సత్ఫలితాలు కనుక ఇవ్వకపోతే దీనికి ప్రభుత్వం వద్ద ప్రత్యామ్నాయ ప్రణాళిక ఏమైనా ఉందా అంటూ ప్రశ్నించారు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1211 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో వైరస్ బాధితుల సంఖ్య పది వేలు దాటింది. దీంతో మంగళవారం ప్రకటన చేశారు. ఇదే విషయమై సోషల్ మీడియాలో స్పందించిన ప్రశాంత్ కిషోర్ ముగిసేది కాదని, దానివల్ల ఆశించిన ఫలితం రాకపోతే తర్వాత ఏం జరగబోతోంది..?  దాన్ని సరిచేయడానికి మన దగ్గర ఏదైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయా అని కేంద్ర ప్రభుత్వాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రశాంత్ కిషోర్ ప్రశ్నించారు.


 మార్చి 24 వ తేదీ అర్ధరాత్రి నుంచి విధించిన లాక్ డౌన్ నిబంధన సరైందని ఒప్పుకున్న ప్రశాంత్ కిషోర్, దానిని పొడిగించే అవకాశాలు ఉన్నాయని గతంలోనే చెప్పారు. ప్రస్తుతం భారత్ ఉన్న పరిస్థితుల్లో కరొనను ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేదని, దీనికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందేమో అన్న అనుమానం వ్యక్తం చేశారు. అయితే పీకే విమర్శలపై బిజెపి ఇంకా తన స్పందనను తెలియజేయలేదు. చాలా కాలంగా బీజేపీ వైఖరిని తప్పుపడుతూ వస్తున్న ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని ఈ విధంగా విమర్శించడంపై రాజకీయ దుమారం చెలరేగే అవకాశం కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: