తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన ప్రకారం గత 24 గంటల్లో దేశంలో 1, 211 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 31 మంది కరోనా దెబ్బకి మరణించారు. అలాగే భారతదేశంలో కోవిడ్ 19 వ్యాధిగ్రస్తులకు ప్రత్యేకంగా చికిత్స అందించేందుకు ఇప్పటివరకు 604 ఆసుపత్రులు ఉన్నాయని... వాటిలో 106, 719 ఐసోలేషన్ పడకలు ఉన్నాయని... 12000 ఐసీయూ పడకలు కూడా అందుబాటులో ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.


జనవరి 30వ తేదీ నుండి కోవిడ్ 19 టెస్టులు చేసేందుకు అత్యాధునికమైన వైద్య సదుపాయాలను ఉపయోగించామని... అందుకే కరోనా కేసుల సంఖ్య భారతదేశంలో విపరీతంగా పెరిగిపోలేదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మాట్లాడుతూ... ఇండియాలో ఇప్పటివరకు 10,363 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా వాటిలో 1,035 మంది పూర్తిగా డిశ్చార్జి అయిన వారు ఉన్నారని, 339 మాత్రం కరోనా దెబ్బకు మృత్యువాత పడ్డారని చెప్పారు. ప్రస్తుతానికి దేశంలో 8,988 ఆక్టివ్ కేసులు కేసులు ఉన్నాయని ఆయన వెల్లడించారు. తాము వేగవంతమైన కరోనా టెస్టింగ్ కిట్లను ఉపయోగించుకుంటూ రోజుకి వేల సంఖ్యలో టెస్టులు చేస్తున్నామని వెల్లడించారు.


ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఉన్నత అధికారులు మాట్లాడుతూ... ఇప్పటి వరకు రెండు లక్షల 30 వేల మందికి కరోనా టెస్టులు నిర్వహించామని... గత 24 గంటల్లో 21, 635 టెస్టులు నిర్వహించడం జరిగిందని వెల్లడించారు. సరిపడినంత టెస్టింగ్ కిట్లను ఇప్పటికే మేము పొందగలిగాము. ఇంకో 33 లక్షల TR-PCR టెస్టింగ్ కిట్ల కోసం ఆర్డర్ చేశాము. 37 రాపిడ్ టెస్టింగ్ పరికరాల కోసం కూడా ఆర్డర్ చేశాము' అని మెడికల్ రిసెర్చ్ ఉన్నతాధికారులు తెలిపారు. ఐయిమ్స్(AIIMS) ఆసుపత్రి మొట్టమొదటిగా కోవిడ్ 19 వ్యాధిగ్రస్తులకు చికిత్స చేసేందుకు ఉపయోగించబడిందని ఇండియన్ మెడికల్ రీసెర్చ్ అధికారులు చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: