కరోనా వైరస్ ఎలా వణికిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. రోజు రోజుకు విజృంభిస్తున్న ఈ కరోనా వైరస్ ను ఆపాలి అంటే కాస్త కష్టం అనే చెప్పాలి. ఇంకా ఈ నేపథ్యంలో కరోనా వైరస్ నుండి కాపాడుకోవడానికి మాస్కులు ధరించాలి అని చెప్తుంటే ఓ యువకుడు మాత్రమే మాస్కు ధరించడంపై ఎగతాళి చేసాడు. 

 

ఈ వీడియో చేసిన యువకుడికి కరోనా వైరస్ పాజిటివ్ రావడం కలకలం రేపింది.. మధ్యప్రదేశ్ లోని జబల్‌పూర్‌కు చెందిన సమీర్ ఖాన్ అనే 25 ఏళ్ళ యువకుడికి కరోనా వైరస్ రాకుండా ఉండటానికి మాస్కులు కాదు దేవుడిని నమ్ముకోండి అంటూ టిక్ టాక్ లో వీడియో పోస్ట్ చేశాడు.. అతడి వీడియోలు చుసిన అనేక మంది నెటిజన్లు అతన్ని తిడుతూ కామెంట్ చేశారు..  


 
అయితే ఆ వీడియో తీసిన అతను కొద్ది రోజుల క్రితమే దగ్గు, జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్నడు. దీంతో అతనిలో కరోనా లక్షణాలు కనిపించడంతో కుటుంబ సభ్యులు అతనికి కరోనా పరీక్షలు చేయించగా పాజిటివ్ అని తేలింది. అయితే అతనిలో ఈ లక్షణాలు వాళ్ళ అక్క ఇంటికి వెళ్లి వచ్చాక కనిపించాయి.. ఇందుకు కారణం అతని నిర్లక్ష్యమే అని.. శుభ్రత పాటించకుండా ఉండటం వల్లనే ఇలా జరిగింది టిక్ టాక్ లో అతని వీడియోల కింద కామెంట్లు చేస్తున్నారు. ఏమైతేనేం.. నిర్లక్ష్యంగా ఉంటే ఇలానే ఉంటుంది అని తెలిసిలే దేవుడు చేశాడు.                

 

మరింత సమాచారం తెలుసుకోండి: