పొరుగున ఉన్న పాకిస్థాన్ గురించి అక్క‌డి ద‌రిద్ర‌పు పోక‌డ‌ల గురించి ప్ర‌త్యేకంగా చెప్పేదేముంది? య‌థారాజా త‌థా ప్ర‌జా అన్న‌ట్లుగా అక్క‌డి పాల‌కులు ప్ర‌జ‌లు అంద‌రూ ఒకే రీతిలో సాగుతున్నారు. కోవిడ్‌ 19 వ్యాప్తి స‌మ‌యంలోనూ ఆ దేశంలో కుళ్లు రాజకీయాలు జ‌రుగుతున్నాయి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా నియంత్ర‌ణ‌కు అన్ని దేశాలు కూడా లాక్‌డౌన్ పాటిస్తున్న నేప‌థ్యంలో చేయ‌డానికి ప‌ని లేక‌, తిన‌డానికి తిండిలేక అనేక మంది ఇబ్బంది ప‌డుతున్నారు. పాకిస్థాన్‌లోని హిందువులు, క్రైస్తవులు, ఇతర మైనార్టీలు నిరంతరం బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. దేశంలో కరోనా వ్యాప్తి మధ్య మైనారిటీలైన హిందువులు, క్రైస్తవులకు ఆహారం కొరత ఎదుర్కొంటున్నట్లు యూఎస్‌ ఇంటర్‌నేషనల్‌ రిలిజియన్‌ ఫ్రీడమ్‌ తెలిపింది. ఈ చర్యల ఖండించాలని యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌ కమిషనర్‌ అనురిమా భార్గవ తెలిపారు. అయితే దీనిపై  తాజాగా ఊహించని ప‌రిస్థితి ఎదురైంది.

 

అయితే పాకిస్తాన్‌లో ఉంటున్న‌ మైనార్టీల‌పై పాకిస్తాన్ చూపుతున్న వివ‌క్ష స‌రికాద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. పాక్‌లోని క‌రాచీలో సేల‌నీ వెల్ఫేర్ ఇంటర్నేష‌న‌ల్ ట్ర‌స్టు అనే స్వ‌చ్ఛంద సంస్థ వ‌ల‌స కూలీలు, ఇళ్లు లేని నిరుపేద‌ల‌కు ఆహ‌రాన్ని  అందిస్తుంది. అయితే ఆహారం అందించే స‌మ‌యంలో హిందువులు, క్రిస్టియ‌న్లు స‌హా ఇత‌ర మ‌త‌స్థుల‌పై వివ‌క్ష ప్ర‌ద‌ర్శించింది. ఇతర మతస్థులకు ఆహారాన్నిఇవ్వ‌డానికి నిరాక‌రించింది. ఈ నేప‌థ్యంలోనే అమెరికా పాకిస్తాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. క‌రోనా సంక్షోభం త‌లెత్తిన  ప‌రిస్థితుల్లో ఇత‌ర మ‌తాల‌పై వివ‌క్ష ప్ర‌ద‌ర్శిస్తున్న పాక్‌ను అమెరికా చివాట్లు పెట్టింది . ఇలాంటి స‌మ‌యంలో మ‌త‌వివ‌క్ష చూపించ‌డం స‌రికాద‌ని  హిత‌వు ప‌లికింది.

 

పాకిస్తాన్‌లో పేద కుటుంబాలు ఆక‌లితో అల్లాడుతున్నాయ‌ని  ఇలాంటి పరిస్థితుల్లో మ‌తం కార‌ణంగా ఆహారాన్ని అందించే విష‌యంలో వివ‌క్ష ప్ర‌ద‌ర్శించ‌డం సరికాద‌ని తెలిపింది. ఇలాంటి ప‌ద్ద‌తి గ‌ర్హ‌నీయ‌మ‌ని, ఇప్ప‌టికైనా మ‌నుషులంద‌రినీ స‌మ‌భావంతో చూడాల‌ని సూచించింది. ఇదిలాఉండ‌గా, యూఎస్‌ ఇంటర్‌నేషనల్‌ రిలిజియన్‌ ఫ్రీడమ్‌ కమిషనర్‌ అనురిమా భార్గవ స్పందిస్తూ కోవిడ్‌ 19 వ్యాప్తి కారణంగా బలహీనవర్గాలు పాకిస్థాన్‌లో ఆకలితో పోరాడుతున్నాయని పేర్కొన్నారు. ఒక విశ్వాసం కారణంగా ఆహార సహాయం చేయడానికి నిరాకరించకూడదని, సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండటానికి వారికి హక్కులు ఉన్నాయని తెలిపారు. హిందువులు, క్రైస్తవులు, ఇతర మైనారిటీలకు ఆహార సహాయం ఇతరులతో సమానంగా అందేవిధంగా చూడటం ప్రభుత్వ బాధ్యత అని హితవు పలికారు. కొద్దిపాటిగా ఉన్న హిందూ మైనారిటీలు పాకిస్థాన్‌లో తరుచూ తమ హక్కులను కోల్పోతున్నారని చెప్పారు. ఈ స్పంద‌న అనంత‌రం అమెరికా ఈ హెచ్చ‌రిక‌లు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: