లాక్‌డౌన్ కొనసాగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. సూపర్ మార్కెట్లు, కిరాణా కొట్లలో సరుకు తరిగిపోతోంది. దిగ్బంధం కారణంగా నిత్యావసరాల సరఫరా దెబ్బ తింది. దీంతో ధరలకు రెక్కలు వచ్చాయి. అధిక ధరలకు అమ్మారో.. కేసులు పెడతాం అని పాలకులు చేస్తున్న హెచ్చరికలు కాగితాలకే పరిమితం అవుతున్నాయి. దీంతో బెజవాడలో వ్యాపారులు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతోంది. 

 

ముందు జనతా కర్ఫ్యూ... దానికి కొనసాగింపుగా లాక్‌డౌన్. కేంద్ర ప్రభుత్వం సడన్‌గా 21 రోజుల లాక్‌డౌన్ ప్రకటించడంతో అందరూ షాక్ తిన్నారు.  దాన్నిప్పుడు కేంద్రం మే 3 వరకూ పొడిగింది. లాక్‌డౌన్‌ కు ఎవరూ రెడీగా లేకపోవడంతో.. పరిస్థితులు కఠినంగా మారుతున్నాయి.  లాక్ డౌన్ ను పొడిగించిన కేంద్రం పాజిటివ్ కేసుల నమోదు దృష్ట్యా రెడ్ జోన్లను గుర్తించి వాటిపై ఫోకస్ పెట్టింది. లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ ప్రధాని మోడీ ప్రకటన చేసిన తర్వాత.. విజయవాడలో నిత్యావసరాలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఈ డిమాండ్‌ను సొమ్ము చేసుకునేందుకు వ్యాపారులు ఇష్టం వచ్చినట్లు ధరలు పెంచారు.


లాక్‌డౌన్‌ అమల్లో ఉండటంతో ప్రభుత్వం నిర్దేశించిన సమయంలోనే నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. దీనితో అందరూ కూడా ఉదయం 6 నుంచి 9 గంటల వరకు సరకుల కోసం బయటకు వస్తున్నారు. లాక్‌డౌన్‌ను పొడిగించడంతో  కొందరు వ్యాపారులు ధరల్ని అడ్డగోలుగా పెంచారు. సరకుల సరఫరా ఆశించిన స్థాయిలో లేకపోడవం కూడా ధరల పెరుగుదలకు దారి తీస్తోంది. పంట కోతలు, ఉత్పత్తుల తయారీలో జాప్యం, పెరుగుతున్న రవాణా ఖర్చులు ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు.


మే మూడు తర్వాత కూడా లాక్‌డౌన్ పొడిగిస్తారనే అక్కడక్కడా ప్రచారం జరుగుతోంది. దీంతో డబ్బున్నవాళ్లు పెద్ద మొత్తంలో సరకులు కొనడం వల్ల.. కొరత ఏర్పడుతోంది. లాక్ డౌన్ పొడిగించిపుడు సరుకులు దొరకవనే ఆలోచనతో పెద్ద ఎత్తున నిత్యావసర వస్తువులు అమ్మే మాల్స్, చిల్లరదుకాణాల దగ్గర జనాలు లాక్‌డౌన్ సమయాల్లో బారులు తీరుతున్నారు. బెజవాడలో మార్చి 21కి అంటే లాక్ డౌన్ ముందు ప్రస్తుతం ధరలను రైతుబజార్లలో పరిశీలిస్తే ధరల పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. 


రైతుబజార్ ధరల ప్రకారం చూస్తే లాక్‌డౌన్‌కి ముందు అల్లం కిలో 50రూపాయలుంటే ప్రస్తుతం 120 రూపాయలైంది. బహిరంగ మార్కెట్లో వెల్లుల్లి 80 నుంచి 220 వరకు అమ్ముతున్నారు. మినపగుళ్ళు 110 నుంచి 140, కందిపప్పు 85 నుంచి 120కి చేరాయి. red CHILLIES' target='_blank' title='ఎండుమిర్చి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఎండుమిర్చి, చింతపండు, వంట నూనెల ధరలు కూడా పెరిగాయి. పంటలు చేలల్లో ఆగిపోవడం.. నిత్యావసరాల ఉత్పత్తి మందగించడంతో సప్లై చెయిన్‌ దెబ్బతింది. సరఫరా లింకు తెగడం వల్లనే ధరలు పెరిగాయంటున్నారు వ్యాపారులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: