టీడీపీ అధినేత చంద్రబాబు ఏ విషయాన్నైనా రాజకీయం చేయడంలో దిట్ట అనే సంగతి తెలిసిందే. పరిస్థితులు ఎలా అయినా ఉండని, ఆయనకు మాత్రం రాజకీయమే కావాలి. ప్రస్తుతం ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం  తెలిసిందే. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి అండగా ఉండాల్సింది పోయి, ప్రభుత్వంపై బురద జల్లడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.

 

ఈ క్రమంలోనే చంద్రబాబు, తన సొంత జిల్లా చిత్తూరుకు చెందిన డిప్యూటీ సీఎం నారాయణస్వామి టార్గెట్ గా రాజకీయం చేయడం మొదలుపెట్టారు. ఇటీవల ఢిల్లీ మర్కజ్ యాత్ర నేపథ్యంలో డిప్యూటీ సీఎం ఓ వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. లాక్ డౌన్ తో దేశమంతా ఓ వైపు ఉంటే వీరు మాత్రం అర్ధపర్ధం లేకుండా ప్రవర్తిస్తున్నారని, శుభ్రత పాటించమని విజ్ఞప్తి చేస్తే, ప్లేట్లు, స్పూన్లు నాకుతున్నారని విమర్శించారు.

 

దీంతో నారాయణ మీద పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆయన ఆ వర్గానికి క్షమాపణ కూడా చెప్పారు. తన మాటలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించమని కోరారు. ఇక ఇలా డిప్యూటీ సీఎం క్షమాపణ కోరినా, చంద్రబాబు మాత్రం మంత్రిని బర్తరఫ్ చేయాలని అంటున్నారు. ఇక దీనికి డిప్యూటీ సీఎం, అదే జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గట్టి కౌంటర్లే ఇచ్చారు. మతాన్ని కించపరిచారంటూ, చంద్రబాబు తన అనుకూల మీడియాలో రాయిస్తున్నారని, అసలు ఇంతవరకు చంద్రబాబు మైనార్టీలకు ఏం చేసారో చెప్పాలని డిమాండ్ చేశారు.

 

నిజానికి మైనార్టీలకు చంద్రబాబు ఇంతవరకు పెద్దగా ఏం చేయలేదు. అప్పట్లో దివంగత వైఎస్సార్, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డిలు మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తున్నారు. పైగా టీడీపీలో పెద్ద మైనార్టీ  లీడర్ గానీ, ఎమ్మెల్యేగానీ లేరు. కానీ వైసీపీలో మాత్రం మైనార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాగే ఒక డిప్యూటీ సీఎం కూడా మైనార్టీ ఉన్నారు. దీని బట్టి చూసుకుంటే బాబుకు ఎప్పుడు కులాలు, మతాల మీద రాజకీయం చేయడమే తప్ప, వారికి సరైన న్యాయం చేయడంలో ముందుండరని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: