కృష్ణా జిల్లా రాజకీయాల్లో టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా, వైసీపీ సీనియర్ నేత, మంత్రి కొడాలి నానిలకు అసలు పడదనే విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంటుంది. అయితే ఇక్కడ ఉమా వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి, జగన్ ని విమర్శించడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు.

 

పైగా తాను ఓడిపోయి ఖాళీగా ఉంటున్నారేమో గానీ, రోజూ ప్రెస్ మీట్ పెట్టి మరి జగన్ ప్రభుత్వంపై  బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. అయితే ఉమాకు సరైన కౌంటర్ ఇవ్వగలిగేది మంత్రి కొడాలి నానినే. అందుకే ఉమా 10 సార్లు ప్రెస్ పెట్టి ప్రభుత్వాన్ని విమర్శిస్తే, కొడాలి ఒక్కసారి మీడియా ముందుకొచ్చి, చంద్రబాబు, ఉమాలని కడిగిపారేస్తారు.

 

కేవలం రెండు మూడు డైలాగులతోనే వారి పరువు తీసేసారు. తాజాగా కూడా రాష్ట్రంలో కరోనా ప్రభావం చూపుతున్న నేపథ్యంలో టీడీపీ నేతలు, దేవినేని ఉమా జగన్ ప్రభుత్వంపై నోటికొచ్చినట్లు విమర్సలు చేస్తున్నారు. దీంతో సడన్ గా ఎంట్రీ ఇచ్చిన కొడాలి నాని, ఉమాని తీసేసిన తహసీల్దార్ అని చెప్పి, ఒకమాటతో పరువు తీశారు. అయితే ఈ దెబ్బకు ఉమా, కొడాలి నాని జోలికి రావడం కష్టమనుకునే నేపథ్యంలో, ఉమా తాజాగా మీడియా సమావేశం పెట్టి, సీఎం జగన్, మంత్రుల చేత బూతులు మాట్లాడిస్తున్నారని తెగ బాధపడిపోతున్నారు.

 

అలాగే గన్ మెన్లను తొలగించి భౌతిక దాడులు చేస్తామని హెచ్చరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఉమా మాటలు బట్టి చూస్తే కాస్త భయపడుతున్నట్లు కనిపిస్తోంది. తాము ప్రభుత్వం చేస్తున్న అసత్య ఆరోపణల వల్ల, జనం ఎక్కడ కొడతారా అని టెన్షన్ పడుతున్నట్లున్నారు. అందుకే పరోక్షంగా గన్ మెన్లని తొలగించి, వైసీపీ నేతలు దాడులు చేస్తారని ఆరోపణలు చేస్తున్నారు. అయితే మళ్ళీ ఉమా, కొడాలి పై పరోక్షంగా బూతులు మాట్లాడుతున్నారని విమర్శించి, మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక ఇలా పదే పదే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఈసారి కొడాలి గట్టి కౌంటర్లు ఇవ్వడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: